నెల్లిమర్లలో టీడీపీ జోరు.. ఎస్ఎంసీ ఎన్నికల్లో ఘనవిజయం
* చైర్మన్లు, వైస్ చైర్మన్లకు ఘన సత్కారం
నెల్లిమర్ల అక్టోబర్ 1, మేజర్ న్యూస్:
నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధిలోని పాఠశాలలు, రెసిడెన్షియల్, కేజీబీవీ పాఠశాలలకు నిర్వహించిన స్టూడెంట్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు అద్భుతమైన విజయాలను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ మద్దతుతో గెలుపొందిన నూతన చైర్మన్లు, వైస్ చైర్మన్లను స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం ఘనంగా సత్కరించారు.
ఈ అభినందన సభలో టీడీపీ సీనియర్ నాయకులు సువ్వాడ రవిశేఖర్, ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి గేదెల రాజారావు, మండల, నగరపంచాయతీ టీడీపీ అధ్యక్షులు కడగల ఆనంద్ కుమార్, లెంక అప్పలనాయుడు తదితరులు విజేతలను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నగరపంచాయతీ పరిధిలోని విద్యాసంస్థల్లో ఎస్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు తమ సత్తా చాటారని, ప్రజాస్వామ్య బద్ధంగా సాధించిన ఈ విజయం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి నూతన కమిటీలు ప్రత్యేక చొరవ చూపాలని ఆకాంక్షించారు.
జడ్పీ హైస్కూల్ (రెల్లివీధి): మొయిద సంతోష్ కుమారి (చైర్మన్), గూడుపు వలస తిరుపతిరావు (వైస్ చైర్మన్), గండ్రేటి ఝాన్సీ (వైస్ చైర్మన్ - ఎంపీపీ స్కూల్)
ఎంపీపీ స్కూల్ (గాంధీనగర్ కాలనీ): వలిశెట్టి రాధిక (చైర్మన్)
సీకేఎం జడ్పీ హైస్కూల్: పురిటి శ్రీనివాసరావు (చైర్మన్)
కేజీబీవీ (KGBV) స్కూల్: పిన్నింటి లక్ష్మీనారాయణ (చైర్మన్), బైరెడ్డి అప్పల నరసింహ (వైస్ చైర్మన్)
ఎంపీపీ స్కూల్ (రామతీర్థం జంక్షన్): చందక మహాలక్ష్మి (చైర్మన్)
ఎంపీపీ స్కూల్ (కొండపేట): పాలూరి వాసు (చైర్మన్), ఆల్తి పార్వతి (వైస్ చైర్మన్)
జడ్పీ హైస్కూల్ (జరజాపుపేట): కోన ముత్యాల నాయుడు (చైర్మన్), వంకల పైడిరాజు (చైర్మన్)
యూపీ స్కూల్ (జరజాపుపేట): కనకల నాగరాజు (చైర్మన్)
ఎంపీపీ స్కూల్ (ఎస్సీ కాలనీ, జరజాపుపేట): నకిడాపు కుమారి (చైర్మన్), సవరపు నాగమణి (వైస్ చైర్మన్)ను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అట్టాడ శ్రీధర్, నల్లి చంద్రశేఖర్, అవనాపు సత్యనారాయణ, గురాన చక్రీదర్, కింతాడ కళావతి, కలిశెట్టి కన్నంనాయుడు, తాడ్డి సత్యనారాయణ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలను అభినందించారు.