నర్సీపట్నంలో రోజురోజుకు పెరుగుతున్న దొంగతనాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలి.
నర్సీపట్నంలో రోజురోజుకు పెరుగుతున్న దొంగతనాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలి.
దసరా సెలవులకు ఊరు వెళితే పోలీసు వారికి
తెలియజేయండి
LHMS సేవను వినియోగించుకోండి – మీ ఇంటిని సురక్షితంగా ఉంచుకోండి.
సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ కె గఫూర్ ప్రజలకు విజ్ఞప్తి
నర్సీపట్నం అక్టోబర్ 1 మేజర్ న్యూస్ :
నర్సీపట్నం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ కే గఫూర్ ఇటీవల రోజురోజుకు పెరుగుతున్న దొంగతనాలపై ప్రజలకు ముఖ్యమైన పోలీస్ హెచ్చరిక జారీ చేశారు.
ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నర్సీపట్నం టౌన్ పోలీసులు సూచిస్తున్నారు.
ఇటీవల కాలంలో నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో, ప్రజలను అప్రమత్తం చేయడానికి నర్సీపట్నం టౌన్ పరిధిలో ఆటో ద్వారా మైక్ అనౌన్స్‌మెంట్ నిర్వహిస్తున్నాము.
ప్రజలు ఇంటికి తాళం వేసి ఊరికి లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో, తమ ఇంటి వివరాలను సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేసి LHMS – Locked House Monitoring System సేవను వినియోగించుకోవాలి.
ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లేటప్పుడు నగదు, బంగారు ఆభరణాలు మరియు విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంటి తలుపులు, కిటికీలు సక్రమంగా లాక్ చేసుకోవడంతో పాటు, వీలైనంతవరకు CCTV కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.
తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
దొంగతనాల నివారణలో ప్రజల అప్రమత్తతే ముఖ్యమైన రక్షణ.
LHMS సేవను వినియోగించుకోండి – మీ ఇంటిని సురక్షితంగా ఉంచుకోండి.
నర్సీపట్నం టౌన్ పోలీసుల విజ్ఞప్తి. చేస్తూ మైకు ప్రచారాన్ని నిర్వహించారు.