BREAKING
జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన ఎం.ఎన్.ఆర్ విద్యార్థి కొవ్వూరి పూర్ణ యశ్వంత్ రెడ్డి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అంటున్న స్క్విడ్ గేమ్ నటి: డ్యాన్స్ నేర్పిస్తే ఆఫర్‌కు సై! తహసీల్దార్ కందుల కుశరాజుకు వినతి పత్రం అందించిన రేషన్ డీలర్లు జాతీయ అవార్డు గ్రహీత వినోద్ కప్రి 'పైర్' ట్రైలర్ విడుదల: పిల్లల కోసం ఎదురుచూసే వృద్ధ దంపతుల భావోద్వేగ గాథ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి మాచవరంలో ప్రమాదకరంగా ఒరిగిన విద్యుత్ స్తంభం: భయాందోళనలో గ్రామస్తులు, తక్షణమే తొలగించాలని విజ్ఞప్తి! సీనియర్ నటుడు మురళీ మోహన్ మనీ సీక్రెట్స్: ఆర్థిక క్రమశిక్షణతో జీవితాన్ని మార్చుకోవడం ఎలా? తెలుగు భాషా వికాసంలో చైతన్యరాజుకు జీవిత సాఫల్య పురస్కారం.. రణబాలి ప్రీ రిలీజ్ వేడుకలో బుచ్చిబాబు సాన సంచలన వ్యాఖ్యలు: విజయ్ దేవరకొండ స్టార్ పవర్‌పై ప్రశంసల జల్లు కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో... వ్యక్తి ఆ దృశ్యం రణబాలి ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ సంచలన కామెంట్స్: విజయ్ దేవరకొండ విజన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు ఉద్యోగుల డీఏలను వెంటనే విడుదల చేయాలి రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి : రావులపాలెం మండల రేషన్‌ డీలర్ల సంఘం డిమాండ్‌ బీ టి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కూట‌మి ప్ర‌భుత్వం అభివృద్ధి చూసే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక‌లు..:ఎమ్మెల్యే అయితాబ‌త్తుల ఆనంద‌రావు

నలుగురు సజీవ దహనం

Select Suryaa Now
నలుగురు సజీవ దహనం

 విజయవాడ, సూర్య ప్రతినిధి :విజయవాడ బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఓ ఎలక్ట్రిక్ కారు (EV) అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను తీవ్రంగా ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల వ్యవధిలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయి.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదానికి అతివేగమే కారణమా లేక ఈవీ బ్యాటరీలో సాంకేతిక లోపం తలెత్తిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.