BREAKING
నీతి నిజాయితీకి చిరునామా.. సాయి కొండ సుమలత...! చెట్టుకు ఢీకొని ఇద్దరు యువ కార్మికులు దుర్మరణం దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరిక. అలియాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా దసరా వేడుకలు నేడే ఇల్లందు ఫారెస్ట్ గ్రౌండ్‌లో దసరా ఉత్సవాలు – ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ల పరిశీలన నాటకీయ పరిణామాలపై న్యాయపోరాటం చేస్తం : మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆరు భాషల్లో ఘనంగా 'జయహో రామానుజ' విడుదల.. శ్రీరామానుజాచార్యుల జీవిత చరిత్ర ఆధారంగా విజువల్ వండర్! మెట్లకుంటలో ఘనంగా దుర్గామాత సామూహిక కుంకుమార్చన కోహిర్ మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు టి. సువర్ణ మల్లన్న ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ రేఖ వెంకట్ రెడ్డి *జిల్లా కలెక్టర్‌ను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు* *జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు* 27వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...! అందోల్ నియోజకవర్గం ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

నాటుసారా పట్టివేత

Select Suryaa Now
నాటుసారా పట్టివేత

మెలియాపుట్టి, సూర్య : మెలియాపుట్టి మండలం లో మురికింటి భద్ర గ్రామంలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు నిర్వహించిన కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌లో సుమారు 25 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నాటుసారా తయారుచేసి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్సై మహమ్మద్ అమీర్‌ అలీ ఆధ్వర్యంలో పోలీసు బృందం గ్రామాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా నాటుసారాను ప్యాకెట్ల రూపంలో స్వాధీనం చేసుకోవడంతోపాటు, తయారీకి ఉపయోగించిన సామగ్రిని సీజ్‌ చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అమీర్‌ అలీ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికల కోడ్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఈ తనిఖీల్లో మెలియాపుట్టి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్ : నాగిరెడ్డి, శ్రీకాకుళం జిల్లా.