BREAKING
నేటి రాశి ఫలాలు: 11 అక్టోబర్ 2026. నేటి పంచాంగం 11 అక్టోబర్ 2026 తులిప్ స్కూల్‌లో సందడిగా పీపుల్స్ లీడర్ ఎన్నికలు. కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్!

నారాయణ మెడికల్ కళాశాలలో ఘనంగా 'యువ సంవాద్ మేళా'

Select Suryaa Now
నారాయణ మెడికల్ కళాశాలలో ఘనంగా 'యువ సంవాద్ మేళా'

 మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపు

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్   :     కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్ – జాతీయ సేవా పథకం పిలుపు మేరకు నిర్వహిస్తున్న 'నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్ – 100 వారాల సంకల్ప అభియాన్'లో భాగంగా నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో నాల్గవ వారం కార్యక్రమం “యువ సంవాద్ మేళా” ఘనంగా జరిగింది. “నా ఆరోగ్యం – నా గర్వం”  అనే ఇతివృత్తంతో కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో దాదాపు 700 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ సీఐ కె. వెంకటరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా యువజన అధికారి బి. శశికాంత్ రెడ్డి, నారాయణ మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ పి. శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. దేశ ప్రగతికి చోదకశక్తి అయిన యువత మత్తు పదార్థాలు, వ్యసనాలకు దూరంగా ఉంటూ శారీరక, మానసిక దృఢత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం ఈగల్ బృందం ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ స్కానింగ్, టోల్‌ఫ్రీ నంబర్లపై అవగాహన కల్పిస్తూ, విద్యార్థులందరితో ‘నషా ముక్త భారత్’ ప్రతిజ్ఞ చేయించారు.  కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన వీధి నాటకం మాదకద్రవ్యాల వల్ల కుటుంబాలు, జీవితాలు ఎలా ఛిద్రమవుతాయో కళ్లకు కట్టి ఆకట్టుకుంది. ఈషా ఫౌండేషన్ యోగా ప్రదర్శన, శాస్త్రీయ నృత్యాలు, విద్యార్థుల ప్యానెల్ చర్చ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం వివిధ అవగాహన స్టాళ్లను సందర్శించిన అతిథులు, ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. డాక్టర్ ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి. చంద్రశేఖర్ తదితరుల మార్గదర్శకత్వంలో, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి.ఎం. కార్తీక్ సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.