BREAKING
కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్.. ఏఐ ఫేక్ కంటెంట్‌పై సంచలన పిటిషన్ *ఓటు హక్కుపై గళమెత్తిన కాంగ్రెస్‌* ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యలో మెరిసిన ప్రశాంత్ - బిఆర్ఎవోయు స్నాతకోత్సవంలో బంగారు పతకం

నానా పటేకర్, సింగీతం శ్రీనివాసరావు సినీ సేవలు చిరస్మరణీయం.

Select Suryaa Now
నానా పటేకర్, సింగీతం శ్రీనివాసరావు సినీ సేవలు చిరస్మరణీయం.

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్, ఎండీ విశ్వనాథన్, బోర్డు సభ్యుల ఘన నివాళి.

భారతీయ సినీ రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖ నటుడు నానా పటేకర్, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC) ఘనంగా నివాళులర్పించింది. గురువారం  విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్ లోని ఆర్టీసీ ప్రధాన హాల్‌లో నిర్వహించిన బోర్డు సమావేశంలో ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి. భరత్ భూషణ్, మేనేజింగ్ డైరెక్టర్ కే. విశ్వనాథన్, బోర్డు సభ్యులు పాల్గొని నానా పటేకర్, సింగీతం శ్రీనివాసరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్, ఎండీ, బోర్డు సభ్యులు సమావేశం లో చర్చిస్తూ.. భారతీయ సినీ రంగానికి నానా పటేకర్, సింగీతం శ్రీనివాసరావు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నటుడిగా నానా పటేకర్ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. విభిన్న పాత్రలను అత్యంత సహజంగా పోషిస్తూ భారతీయ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. అదేవిధంగా దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు తెలుగు సినీ పరిశ్రమకు వినూత్నమైన, ప్రయోగాత్మక చిత్రాలను అందించి తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన సృజనాత్మకత, దర్శకత్వ ప్రతిభ తెలుగు సినిమాకు మాత్రమే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమకు కూడా విశేష గుర్తింపు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. సినీ రంగంలో నానా పటేకర్, సింగీతం శ్రీనివాసరావు అందించిన సేవలు, వారి ప్రతిభ, కృషి భవిష్యత్ తరాల సినీ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. భారతీయ సినిమా అభివృద్ధికి వారు చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు, బోర్డు సభ్యులు, సినీ రంగ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.