BREAKING
ఎమరాల్డ్స్‌లో ఘనంగా కాన్ఫ్లుయెన్స్ 24న జల వనరుల పరిరక్షణపై జాతీయ సదస్సు నేటి పంచాంగం 22 నవంబర్, 2026 గో సంరక్షణలో సరికొత్త అధ్యాయం -దేశీయ గో సంపద పరిరక్షణలో సంచలన విజయం -56 ఐవీఎఫ్ సాహివాల్ దూడలు ఉత్పత్తి.. దేశంలోనే అరుదైన ఘనత దేశీయ ఆవుల జన్యు విప్లవం...వెటర్నరీ వర్సిటీ శాస్త్రవేత్తల అద్భుతం -తిరుపతి వెటర్నరీ వర్సిటీ సంచలన విజయం -వెటర్నరీ - టిటిడి సంయుక్త ప్రాజెక్టుతో సాధ్యం : కేంద్ర మంత్రి ప్రశంసల నేటి రాశి ఫలాలు 22 నవంబర్, 2026 నేటితో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు చివరి గడువు బెండమూర్లంక సర్పంచ్ అభ్యర్థిగా యాళ్ల శ్రీవాణి గణేష్‌పూర్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీ - అక్రమ తవ్వకాలపై డీఎస్పీ సీరియస్ హెచ్చరిక రూ.48.60 కోట్ల అభివృద్ధి.. కేసరపల్లికి మరింత ప్రగతి. సంగాపూర్ లో నేడు పోలియో చుక్కల కార్యక్రమం కొల్లూరు గ్రామ శివారులో ఆధ్యాత్మిక శోభతో వనభోజనాలు తాడిగడప అభివృద్ధి టీడీపీ, జనసేనతోనే సాధ్యం తాడిగడప అభివృద్ధే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు బోడె ప్రసాద్ ప్రచారం సింగూరుకు మరో సువర్ణావకాశం: టాటా నానో నిష్క్రమణ తర్వాత 18 ఏళ్లకు ట్రక్కుల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న అశోక్ లేలాండ్! తాడిగడపలో కూటమి అభ్యర్థులకు బోడె హేమ ప్రచారం

నామినేషన్ల స్వీకరణ పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

Select Suryaa Now
నామినేషన్ల స్వీకరణ పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

మచిలీపట్నం, మేజర్ న్యూస్: రెండవ సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం బందరు మండలం పోతెపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు, అభ్యర్థులకు కల్పించిన సదుపాయాలు, నామినేషన్ పత్రాల పరిశీలన, అవసరమైన రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ అభ్యర్థుల నుంచి నామినేషన్లను నిర్ణీత విధానంలో స్వీకరించాలని సూచించారు. ప్రతి నామినేషన్ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని, నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు అవసరమైన సమాచారం, సహకారం అందించి ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.