ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుమ్మనూరు ఈశ్వర్‌కు ఆహ్వానం
అనంతపురం బ్యూరో : పామిడి పట్టణంలోని నెహ్రూ కాలనీలో ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న శ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుత్తి–పామిడి నియోజకవర్గ ఇన్‌చార్జ్, యువనేత గుమ్మనూరు ఈశ్వర్‌లను గ్రామ పెద్దలు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం క్యాంపు కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమానికి హాజరై ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని కోరారు.
ఆహ్వానించిన వారిలో పామిడి వాసులు, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ బొల్లు శ్రీనివాసరెడ్డి, పూజారులు కుళ్లాయప్ప, నాగభూషణం, టీడీపీ నాయకుడు రఘునాథ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమ ఏర్పాట్లపై వారు ఎమ్మెల్యే, యువనేతతో చర్చించారు.