ముంపు ప్రాంతాలను సందర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం..
సంతబొమ్మాళి, అక్టోబర్ 30,మేజర్ న్యూస్ :అర్ణబ్ తుఫాను కారణంగా సంతబొమ్మాళి మండలం లో వివిధ గ్రామాల్లో పడిపోయిన మరియు నీట మునిగిన వరి పంట పొలాలు ను ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధన స్థానం, ఆముదాలవలస నుండి వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ మదుకుమార్, డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ సృజన, డాక్టర్ రాజేంద్ర కుమార్ తో కూడిన శాస్త్రవేత్తల బృందం సందర్శించడం జరిగింది.క్షేత్ర సందర్శనలో భాగంగా ముంపు ప్రాంతాల రైతులకు రైతులతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు..
ప్రస్తుతం వరి పంట పూత దశ, పాలు పోసుకునే దశ మరియు కోత దశలలో ఉన్నందున వీలైనంత వరకు పొలం నుండి వర్షపు నీటిని ఎప్పటికప్పుడు అవకాశాన్ని బట్టి బయటకు పంపాలన్నారు.పూత దశకు ముందు ఉన్న చేలలో (RGL 2537, బి పి టి 5204 రకాలు)వర్షం తగిన తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటె ఎండాకు తెగులు , మానిపండు తెగులు, మాగుడు తెగులు ,ఆకుముడత , దోమపోటు పెరిగే అవకాశం ఉంది.
పిగులు పొట్టనుండి ఈనిక దశలో చేను పడిపోయి ఒక రోజు మీట మునిగినప్పటికీ 75 శాతం కన్నా ఎక్కువ తాలు గింజలు ఏర్పడి పంట నష్టం జరుగుతుంది.ఆకుముడత పురుగు నివారణకు ఎకరాకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400గ్రా. లేదా క్లోరాన్ట్ర్రిప్రోల్ 60 మి.లీ 200 లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలిదోమపోటు, మాగుడు తెగులు మరియు మానిపండు నివారణకు ఎకరానికి`ప్రోపికోనజోల్ 200 మిల్లి +పైమెట్రోజాన్ 120 గ్రా లేదా ప్రోపికోనజోల్ 200 మిల్లి+96 మిల్లీ ట్రైఫ్లుమెజోపైరం 10 ఎస్ సి పిచికారీ చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో శాస్త్రవేత్తల బృందం మండల వ్యవసాయాధికారి రాళ్లపేట అప్పారావు, వి.ఏ.ఏ లు భిమారెడ్డి, సుప్రియ,ధర్మారావు, గణేష్, శశిభూషణరావు ఆయాగ్రామాల రైతులు పాల్గొన్నారు..