ముఖ్యమంత్రి చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
బేషరుతుగా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ :స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ పేర్కొన్నారు. అప్రజాస్వామ్యపద్ధతిలో ఎన్నికలు నిర్వహించినందుకు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దౌర్జన్యం, బెదిరింపులతో స్థానిక సంస్థ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలల్లో గెలుపొందినా వారి బాధ లేరలేదన్నారు. తక్షణమే దౌర్జన్యాలకు పాల్పడిన కూటమి నాయకులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శింగనమల, తిరుపతి, కదిరి, అనంతపురం, ఇతర ప్రాంతాల్లో వైసిపి, కమÖ్యనిస్టు పార్టీల అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలిచారని అన్నారు. దీనికి ప్రధాన కారణంగా అక్కడ ప్రజాస్వామ్యపద్ధతిలో ఎన్నికలు జరగడమేనని చెప్పారు. కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలతో మన రాష్ట్ర పరువు పోయిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని, కానీ ఇలాంటి దౌర్జన్యాలు, దాదాగిరి జరిగిన దాఖలాలు లేవన్నారు. కేవలం మన రాష్ట్రంలో జరిగాయన్నారు. నామినేషన్ పత్రాలు చింపడం, బెదిరించడం , నామినేషన్‌ను తిరస్కరించేలా చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. కేవలం కనీవినీ ఎరుగని రీతిలో దౌర్జన్యాలు జరిగాయన్నారు. ఎన్నికల కమిషనర్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని, కూటమి ప్రభుత్వానికి కొమ్ముకాసిందని అన్నారు. ఎన్నికలను అడ్డదిడ్డంగా జరిపారన్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే బౌన్సర్లను పెట్టుకుని ఎన్నికల్లో దాదాగిరి చేపట్టారన్నారు. తాడిపత్రిలో కూడాదౌర్జన్యాలు జరిగాయన్నారు. కేంద్ర, అంతర్జాతీయ నిఘా సంస్థలు కూడా కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలను గమనించాయని తెలిపారు. సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో దొంగ ఎన్నికలపై నిరసన తెలిపామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలని హితవుపలికారు. ముఖ్యమంత్రి బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడిందన్నారు. తాడిపత్రి, యల్లనూరు, కళ్యాణదుర్గం పలు ప్రాంతాల్లో పోటీ లేకుండా దౌర్జన్యంగా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారన్నారు. ఎస్పీ, కలెక్టరు స్పందించాలని అన్నారు. అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, సిపిఎం జిల్లా సహాయ కార్యదర్శి రమణారెడ్డి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.