BREAKING
ఆంక్షల గుప్పెట్లో హస్తిన.. అడుగడుగునా పోలీసులు పేకాట స్థావరంపై పోలీసులు దాడి. ఇంకొల్లు సభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ •ఇంకొల్లు, నాగండ్ల, పావులూరులో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు •అభివృద్ధికి తొలి ప్రాధాన్యం... ఎమ్మెల్యే ఏలూరి గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె పండగతో శ్రీకారం అభివృద్ధి పనులతో కళకళలాడుతున్న నియోజకవర్గంలోని గ్రామాలు * భీమవరం మండలంలోని వెంప, శ్రీరామపురం, తుందుర్రు, బేతపూడి కరుకువాడ గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవాలు *ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలి* *సాగు భూముల్లో పశువులతో పంటను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* పర్చూరులో రూ.25.29 కోట్లతో అభివృద్ధి పనులు •మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరికి అడుగడుగునా ప్రజల నీరాజనం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండలి నేతాజీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల కు బహుమతుల ప్రధానం చేసిన......... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ.. వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి! రూ.7.04 కోట్ల రోడ్లను ప్రారంభించిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి .ఉత్తమ పోస్ట్ మాస్టర్‌గా నారపాము దుర్గారావుకు పురస్కారంశుభాకాంక్షలు తెలిపిన మేము సైతం మిత్ర బృందం ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి

మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన యువ చెస్ కెరటం చల్లా నిహారిక

Select Suryaa Now
మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన   యువ చెస్ కెరటం చల్లా నిహారిక

-మంత్రి లోకేశ్‌తో యువ చెస్ క్రీడాకారిణి నిహారిక భేటీ

-ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ సాధించినందుకు అభినందనలు

-ఉమెన్ గ్రాండ్‌మాస్టర్ కావడమే తన లక్ష్యమని వెల్లడించిన నిహారిక

-ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని లోకేశ్ హామీ

ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ చెస్ క్రీడాకారిణి, ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ చల్లా నిహారిక రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. శుక్రవారం ఉండవల్లిలోని మంత్రి నివాసంలో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి లోకేశ్‌తో భేటీ అయింది. ఇటీవలే ప్రతిష్ఠాత్మక ఫిడే ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను సాధించిన నిహారికను ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ భేటీలో నిహారిక సాధించిన విజయాలను మంత్రి లోకేశ్ ప్రశంసించారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్నారని కొనియాడారు. నిహారిక ప్రతిభ, పట్టుదల భవిష్యత్తులో ఎందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా తన భవిష్యత్ లక్ష్యాలను నిహారిక మంత్రికి వివరించింది. ఉమెన్ గ్రాండ్‌మాస్టర్ టైటిల్ సాధించడమే తన తదుపరి లక్ష్యమని ఆమె స్పష్టం చేసింది. ఆమె ఆకాంక్షలను విన్న మంత్రి లోకేశ్, లక్ష్యసాధనలో ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శిక్షణ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనడానికి అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని భరోసా కల్పించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ విధానమని ఆయన పునరుద్ఘాటించారు.