BREAKING
నర్సీపట్నంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ భవనానికి శంకుస్థాపన పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గుమ్మిడి దంపతులకు నీలమ్మ కాలనీ సచివాలయ ఉద్యోగులు సత్కారం అలయ్ బలయ్ గోడ ప్రతి ఆవిష్కరణ. ఎస్సీ కమిషన్ సభ్యులను కలిసిన సర్పంచ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ చింతకాయల పద్మావతి ఆకస్మిక తనిఖీ చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ మేడిపల్లి సత్యం. జడ్పీ చైర్‌పర్సన్ మజ్జి సిరి సహస్త్రను మర్యాదపూర్వకంగా కలిసిన గుమ్మడి సింహాద్రి. నా గెలుపు మరుపెంట పంచాయతీ ప్రజలకే అంకితం! ఎల్‌నినో ముప్పుపై రామగుండం అప్రమత్తం! బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థుల ర్యాలీ జంగులూరు వెలంపాలెం పంచాయతీలో హోరెత్తిన కూటమి ప్రచార జోరు! ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ విద్యార్థులు. మరుపెంట ఉప సర్పంచ్‌గా అక్కేన చిన్నమ్మి ఏకగ్రీవ ఎన్నిక

మంజు రైస్ & కంపెనీపై అధికారుల దాడి

Select Suryaa Now
మంజు రైస్ & కంపెనీపై అధికారుల దాడి

మంజు రైస్ & కంపెనీపై అధికారుల దాడి

నెల్లూరులో అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న మంజు రైస్ & కంపెనీపై అధికారుల దాడి - రూ.42.30 లక్షల విలువైన 1,901 బస్తాల బియ్యం (555.24 క్వింటాళ్ళ) స్వాధీనం

నెల్లూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అధికారులు, పౌర సరఫరాల అధికారులతో కలిసి ఈ రోజు నెల్లూరు నగరంలోని పెదబజార్, లోని డైకస్ రోడ్డులో ఉన్న మంజు రైస్ & కంపెనీపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

తనిఖీలలో సదరు దుకాణ యజమాని జిల్లా సివిల్ సప్లైస్ అధికారి (DSO), నెల్లూరు వారి వద్ద తప్పనిసరిగా పొందవలసిన రిజిస్ట్రేషన్ లేకుండానే హోల్సేల్ మరియు రిటైల్ బియ్యం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా, నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన స్టాక్ రిజిస్టర్లు, కొనుగోలు మరియు అమ్మకాల బిల్లులు నిర్వహించకపోవడంతో పాటు, ఫుడ్ స్టాక్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయవలసిన స్టాక్ వివరాలను కూడా నమోదు చేయలేదని గుర్తించారు.

ఈ నేపథ్యంలో అధికారులు పంచనామా నిర్వహించి, వివిధ బ్రాండ్లకు చెందిన 1,901 బస్తాల బియ్యం, మొత్తం 555.24 క్వింటాళ్ల బరువు గలవి, సుమారు రూ.42,30,674.00 విలువైన నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంలో నిత్యావసర వస్తువుల చట్టం, 1955లోని సెక్షన్ 6(A) ప్రకారం పౌర సరఫరాల అధికారుల ద్వారా నెల్లూరు జాయింట్ కలెక్టర్ వారి ముందు కేసు దాఖలు చేయనున్నారు.

జిల్లా లోని అందరూ రైస్ మిల్లర్లు, బియ్యం హోల్ సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులు ప్రభుత్వం నిర్దేశించిన బియ్యం ధరలు కన్నా ఎక్కువ ధరలకు విక్రయించిన ఎడల వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొనబడునని హెచ్చరించడమైనది. మరియు ప్రభుత్వం నిర్దేశించిన ధరల పట్టికను విధిగా అన్నీ షాపుల ముందు ప్రచురించవలయునని తెలియజేయడమైనది.

నిబంధనలకు విరుద్ధంగా నిత్యావసర వస్తువుల వ్యాపారం నిర్వహించే వారిపై మరియు అక్రమ నిల్వలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.