మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా మురళి బాధ్యతల స్వీకరణ
రావికమతం, సెప్టెంబర్30, మేజర్ న్యూస్ : రావికమతం మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా కే మురళి బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. అనకాపల్లి జిల్లా సాయిల్ కన్జర్వేషన్ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న మురళికి మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన పదవి స్వీకరించారు. మండల పరిషత్ పాలకవర్గం ఈనెల 23 తో ముగిసిన విషయం తెలిసిందే. మండల పరిషత్ పరిపాలన నిరాటంకంగా కొనసాగేందుకు సిబ్బంది అందరు సహకారంతో చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి తెలియజేశారు .