BREAKING
గిరిజన సంఘం సాంస్కృతి కార్యక్రమాలు 37వ డివిజన్‌లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పంటల బీమాకు దరఖాస్తు చేసుకోండి: వ్యవసాయ అధికారి నార్పలలో పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు.. వైభవంగా శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం అయ్యప్ప మాల ధరించిన తిప్పాపూర్ గ్రామ భక్తులు విహార యాత్రల వల్ల విద్యార్థులకు పరిసరాలపై అవగాహన కలుగుతుంది కలెక్టరేట్‌లో వెబ్‌కాస్టింగ్ ద్వారా జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* వివాహ రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంత వెంకట్రామిరెడ్డి. ఐదవ సారి సర్పంచ్ బరిలో విచారపు పావని సిద్ధుగాడి లవ్ స్టోరీకి ఊహించని ఆదరణ.. సక్సెస్ మీట్‌లో చిత్ర బృందం ఆనందం 12 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి అబ్బాస్ గ్రాండ్ రీఎంట్రీ.. అనిల్ రావిపూడి సినిమాలో కీలక పాత్ర! ప్రశాంతంగా ముగిసిన రెండో దశ చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మార్కెట్‌కు భారీగా ధాన్యం రాక నర్సంపేటలో బిఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు పై గులాబీ శ్రేణుల మండిపాటు

మంచం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి సర్పంచ్ అభ్యర్థి ఉప్పరి సుజాత విజ్ఞప్తి

Select Suryaa Now
మంచం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి సర్పంచ్ అభ్యర్థి ఉప్పరి సుజాత విజ్ఞప్తి

 వెల్దుర్తి మేజర్ న్యూస్ :రామళ్లకోట గ్రామ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పోటీ చేస్తున్న తనకు రానున్న పంచాయతీ ఎన్నికల్లో ‘మంచం’ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రామళ్లకోట సర్పంచ్ అభ్యర్థి ఉప్పరి సుజాత గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం గ్రామంలోని పలు వీధుల్లో ఆమె తన మద్దతుదారులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను ఆదరించి సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని పేర్కొన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉప్పరి గోరంట్ల, పెద్ద వెంకటేష్, భాస్కర్ నాయుడు, ఉప్పరి చంటి, ఉప్పరి లింగన్న, షేక్ మహమ్మద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు