BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

మేతా,నీరు లేక అలమటిస్తున్న మూగజీవాలు

Select Suryaa Now
మేతా,నీరు లేక అలమటిస్తున్న మూగజీవాలు

  ఆత్మకూరు,మేజర్ న్యూస్: ఆత్మకూరు ప్రాంతంలో గమనిస్తుంటే మూగజీవాలు మేతా నీరు కరువై అలమటిస్తూ కనిపిస్తున్నాయి.ఆత్మకూరు, మర్రిపాడు, అనంతసాగరం, సంగం,ఏఎస్పేట మండలాల్లో పరిశీలిస్తుంటే ఎండలు తీవ్రంగా ఉంటూ రోజు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ప్రజలు ఎండ వేడిమి భరించలేని పరిస్థితిలో ఉన్నారు. మూగ జీవాల వేదన, రోదన తీవ్రంగా ఉంది.ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు  పొలాల్లో మేత కోసం వేంపర్లాడినా పచ్చిక కనిపించక ఎండ వేడిమి భరించలేక తాగేందుకు నీరు లేక ఎక్కడ చెట్టు నీడ కనిపిస్తే అక్కడకు గుంపులుగా చేరుకొని ఆకలి దాహంతో అలమటిస్తూనే సేద దీరుతున్నాయి. ఆత్మకూరు తాలూకాలో పరిశీలిస్తుంటే దాదాపు రెండు లక్షల మేరకు మూగజీవాలు ఉన్నాయని ఓ అంచనాగా చెబుతున్నారు. ఎండ తీవ్రత ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుండడంతో ఎక్కడ చెట్టు కనిపిస్తుందా ఆ నీడకు చేరుకుందామని మూగజీవాలు పరుగులు తీస్తున్నాయి. ఆ ఎండలోనే నేత కోసం దాహం తీర్చుకునేందుకు కోసం అటుగా పొలాల్లో తిరగడం, ఎక్కడా పచ్చిక కనిపించకపోవడం, వాగులు వంకల్లో నీరు కానరాకపోవడంతో ఉసూరు అంటూ ఆకలి, దాహముతోనే చెట్టు నీడకు చేరుకుంటున్నాయి. ఎండ వేడిమి రోజురోజుకు తీవ్రమతూ మూగజీవాల పరిస్థితి అరణ్య రోదనగా ఉంటుంది. వాటి యజమానులు ఇళ్ల వద్దనే తాగునీరు ఏర్పాటు చేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రభుత్వం మూగజీవాల కోసం అక్కడక్కడ తాగునీటి తొట్లు నిర్మిస్తున్నారు. అయితే  గ్రామాల పొలాల వద్ద నీటితొట్లు విరివిగా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆకలి, దాహం, ఎండతో అలమటిస్తున్న మూగజీవాల గురించి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు యజమానులు అభిప్రాయపడుతున్నారు. నీటి తొట్టిలు విరివిగా ఏర్పాటు చేయాలని, సబ్సిడీతో మేతను కూడా సరఫరా చేయాలని కూడా పలువురు కోరుతున్నారు.