మెలియాపుట్టి సర్పంచ్‌గా ఎరుసు శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవ ఎంపికకు తీర్మానం
ఉప సర్పంచ్‌గా దుక్క నరసింహారెడ్డి పేరు ఖరారు
మెలియాపుట్టి: నవంబర్ 17. మేజర్ న్యూస్....
గ్రామాభివృద్ధి, ఐక్యతే లక్ష్యంగా మెలియాపుట్టి గ్రామస్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సర్పంచ్‌గా ఎరుసు శ్రీనివాసరెడ్డిని, ఉప సర్పంచ్‌గా దుక్క నరసింహారెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు మంగళవారం తీర్మానించారు. స్థానిక కళ్యాణ మండపంలో గ్రామస్తులంతా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.
గ్రామంలో ఐకమత్యాన్ని కాపాడుకోవడంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలకు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇరువురి అభ్యర్థిత్వాలకు అందరూ మద్దతు ప్రకటించారు. వారితో కలిసి నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పోటీకి దూరంగా ఉండి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని గ్రామస్తులు నిర్ణయించుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో మాడుగుల రామారావు, దుక్క చాణక్యరెడ్డి, ప్రసాద్, బసవ భాస్కరరెడ్డి, బసవ పరమేశ్వరరెడ్డి, పోలాకి జయము నిరావ్, మాడుగుల రమణయ్య, శివ, బోను శ్రీను, మాడుగుల భానోజీరావు, ఎచ్చిన రాజమోహనరావు, విజయ్, చాణుక్య, గాలి రామకృష్ణ, పి. సతీష్, దున్న కూర్మారావు, మన్మథరావు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.