BREAKING
సేవే లక్ష్యం అభివృద్ధి అభివృద్దే మా విధానం. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, బస్సులు ఏర్పాటు చేయాలి మర్రిపాడు మండలమంటే నాన్నకు అమితమైన ప్రేమ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గణేష్ గౌడ్ దానిమ్మ తోటల్లో ఎండు తెగులుపై శాస్త్రవేత్తలు పరిశీలన దేశీయంగా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలనే మివి లక్ష్యం మంత్రి శ్రీధర్ బాబు అభివృద్ధితో పాటు పచ్చదనానికి పెద్దపీట నువ్వురుపాడులో టిడిపి అభ్యర్థుల ముమ్మర ఎన్నికల ప్రచారం మృతుల కుటుంబాలకు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ చేయూత గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే మా లక్ష్యం: వైసీపీ నాయకుడు గడ్డం రంజాన్ అందరూ ఆశీర్వదించి విజయం చేకూరిస్తే ఆత్మకూరు అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తా సెగ్మెంట్లో అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు తనకు విజయ సోపానాలు - టిడిపి ఎంపిటిసి అభ్యర్థి ఖాజావలి తలకొండపల్లిలో ఇందిరాగాంధీ వర్ధంతి,సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు* గ్రామాల సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శంషాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యమెందుకు?

మక్కువలో హోరా హోరీగా ప్రచారం

Select Suryaa Now
మక్కువలో హోరా హోరీగా ప్రచారం

మక్కువ, సూర్య : మండల పరిషత్ , జిల్లా పరిషత్ ఎన్నికల తేదీలు సమీపిస్తుండడంతో  మక్కువలో ప్రధాన ప్రతిపక్షాల ప్రచారం ఊపందుకుంది. ఆయా పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన నాయకులు అహర్నిశలు శ్రమిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. వైసిపి తరపున ఎంపిటిల అభ్యర్థులను ఎన్నికల బరిలోకి  దింపిన అభ్యర్థులను గెలుపించుకొనేందుకు వైసిపి నాయకులు మావుడి రంగునాయుడు, మావుడి శ్రీనివాసరావు  , తిరుపతిరావు లు నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రధానంగా మక్కువ ఎంపీటీసీ -2 అభ్యర్థి గెలుపు నకు మూడు పార్టీల నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ పోటీ బరిలో తొలిసారి రాజకీయ అరంగేంట్రం చేసిన వైసిపి మండల పార్టీ అధ్యక్షులు మావుడి రంగునాయుడు సతీమణి మావుడి రామలక్ష్మి ని గెలుపించుకొనేందు వైసిపి నాయకులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఇదే స్థానంలో తెలుగుదేశం తరుపున ఫోటీలో దిగిన అభ్యర్థి చోడవరపు రామకృష్ణారావును గెలిపించుకునేందుకు తెలుగుదేశం నాయకులు దాసరి కేశవరరావు , డాక్టర్ మల్లేశ్వరరావు ప్రచారం మరింత ముమ్మరం చేశారు. కాశీపట్నం ఎంపీటీసీ స్థానం నుండి పోటీ చేయుచున్న మండల అధ్యక్షులు గుళ్ల వేణుగోపాలనాయుడు సతీమణి గెలుపునకు టిడిపి అధ్యక్షులు ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. జనసేన నుండి బరిలోకి దిగిన అభ్యర్థులు గెలుపునకు సీనియర్ నాయకులు మావుడి ప్రసాదరావు కూడా తమదైన పంధాలో ప్రచారం సాగిస్తున్నారు. ఏదేమైనా.. గెలుపు ఓటములు నిర్ణేతలైన ఓటరు దేవుళ్ళను ప్రధాన పార్టీ నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల రణరంగంలో విజయం ఎవరి వరిస్తుందో ఎదురుచూడాల్సింది.