మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి
సిఎస్ పురం,మేజర్ న్యూస్: పొదుపు సంఘాల మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని స్వంతంగా వివిధ వస్తువులు తయారుచేసి విక్రయించి ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని అందుకు గ్రామైఖ్య సంఘాల ప్రతినిధులు మహిళలకు అవగాహన కల్పించాలని వెలుగు అధికారులు అన్నారు.మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయంలో వెలుగు ఎపియం యం.లక్ష్మీనారాయణ అధ్వర్యంలో జిల్లా నాన్ ఫార్మ్ ఎపియం బాలసుబ్రహ్మణ్యం జాతీయ వ్యాపార వ్యవస్థపై ఉత్పత్తుల తయారీ విక్రయంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామాల్లో పొదుపు మహిళలు ప్రతిఒక్కరు సీడ్ క్యాపిటల్ అవుట్ కామేష్ ఉద్యమ్ ఆధార్ కింద ప్రభుత్వం బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతో అందిస్తున్న రుణసదుపాయాలు సద్వినియోగం చేసుకుని పిండి పదార్థాలు వివిధ రకాల వస్తువులు తయారుచేసి ఉత్పత్తులను విక్రయించి ఆర్ధికంగా అభివృద్ధి చెందేలా కృషిచేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో వెలుగు అధికారులు లక్ష్మీనారాయణ,బాలసుబ్రహ్మణ్యం, వెలుగు సిసిలు యం.వి.నారాయణమ్మ,ఐ.మస్తాన్ రెడ్డి,టి.కాశయ్య,విఓఏలు,సిబ్బంది పాల్గొన్నారు.