BREAKING
ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దసరాకు రాష్ట్రపతి రాక సమగ్ర శిశు అభివృద్ధి సేవలను మరింత బలోపేతం చేయాలి.. : జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం.ఏడు మండలాల తహసీల్దార్లతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష ప్రజా సమస్యలపై వెలంపల్లి పోరాటాన్ని అడ్డుకోవద్దు : వైసీపీ మాజీ కార్పొరేటర్ల హెచ్చరిక ఈసీ వైపు ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ: అదుపులోకి తీసుకున్న ఎంపీల విడుదల

మహిళా ఆరోగ్య సంరక్షణలో కృత్రిమమేధపై గీతంలో వర్క్‌షాప్

Select Suryaa Now
మహిళా ఆరోగ్య సంరక్షణలో కృత్రిమమేధపై గీతంలో వర్క్‌షాప్


    విశాఖ ఎడ్యుకేషన్, అక్టోబర్ 6 మేజర్ న్యూస్ : గీతం డీమ్డ్  విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో “మహిళా ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఎఐ)మరియు క్లినికల్ ట్రాన్స్‌లేషనల్ రీసెర్చ్ అనుసంధానం” అనే అంశం పై అక్టోబర్ 26 నుండి 30 వరకు ఐదు రోజుల జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కార్యదర్శి డాక్టర్ కె.నిట్టల లక్ష్మేశ్వర రావు తెలిపారు. భారత ప్రభుత్వ ఆరోగ్య పరిశోధనా విభాగం (డిహెచఆర్), కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సౌజన్యంతో ఈ సదస్సు ఉచితంగా నిర్వహించబడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో రొమ్ము, గర్బాశయ క్యాన్సర్ల ముందస్తు గుర్తింపు, ఎఐ ఆధారిత వైద్య పరికరాలు, డిజిటల్ హెల్త్ టెక్నాలజీస్ మరియు మాతా శిశు ఆరోగ్య డేటా  విశ్లేషణ వంటి పలు కీలక అంశాలపై ప్రముఖ నిపుణులు ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు, వైద్యులు, పిజి విద్యార్ధులు మరియు సాంకేతిక నిపుణులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చునని ఆయన సూచించారు.