BREAKING
ప్రజావాణికి మూడు దరఖాస్తులు.. అర్ధనారీశ్వర స్వామి దేవస్థానంలో ఆకాశదీపం డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ ఆధ్వర్యంలో ఘనంగా గోపినాథ్ జన్మదిన వేడుకలు యువతను ఆగం చేస్తున్నా మోడిఫైడ్ బైక్ సైలెన్సర శబ్దం .... పట్టించుకోని తల్లిదండ్రులు.... విజేత, కటకం కుమారస్వామిని అభినందించిన ఎమ్మెల్యే ఆనందబాబు టాలీవుడ్‌లో కొత్త క్రైండ్‌గా మారిన మలయాళ బ్యూటీ అన.. నేటి కుర్రకారును ఆకట్టుకుంటున్న వైనం ప్రజారోగ్యమే లక్ష్యంగా బస్తీ దవాఖానాలో అవగాహన కార్యక్రమం జడ్పిటిసి హర్షిత్ రెడ్డి కి అభినందనలు తెలిపిన జనార్దన్ యాదవ్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.. భద్రతా విధానాలపై ఐరోపా యూనియన్ పునరాలోచన చేయాలని తేల్చిచెప్పిన ఈయూ నేత టెరెసా రిబెరా అహ్మదాబాద్‌లో రూ. 1,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీపావళి వేడుకల్లో ప్రియుడితో సందడి చేసిన కృతి సనన్.. బాలీవుడ్ ప్రముఖుల హాజరు అమెరికా న్యాయశాఖ సివిల్ డివిజన్ అధిపతి రాజీనామా అమెరికా సుప్రీంకోర్టులో దివంగత బేస్‌బాల్ దిగ్గజం రాబర్టో క్లెమెంట్ కుటుంబానికి చుక్కెదురు డైమండ్ దిగ్గజం డీ బీర్స్‌లో వాటాను 30 శాతానికి పెంచుకోనున్న బోత్వానా

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి రూ.6 వేల జరిమానా

Select Suryaa Now
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి రూ.6 వేల జరిమానా

మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన వ్యక్తికి న్యాయస్థానం రూ.6 వేల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 18న దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మాచర్ల పట్టణానికి చెందిన కోటా వినోద్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన రెండవ తరగతి ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టు నిందితుడికి రూ.6,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా దుర్గి ఎస్‌ఐ బి. గోపాల్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించకూడదని సూచించారు. దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


 

పేర్ల వెంకటేశ్వర్లు సీనియర్ రిపోర్టర్ దుర్గి