మదనపల్లెలో ముమ్మరంగా భద్రతా ఏర్పాట్లు అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన
మదనపల్లెలో ముమ్మరంగా భద్రతా ఏర్పాట్లు
అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన
మదనపల్లె, సెప్టెంబరు 30:
అక్టోబర్ 2న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మదనపల్లెలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆధ్వర్యంలో సీఎం సెక్యూరిటీ అదనపు ఎస్పీ శ్రీ ఎస్.ఎస్.ఎస్.వి. కృష్ణారావు, డీఎస్పీ శ్రీ కె. శివ పోతురాజు, ఎస్‌ఎస్‌జీ అధికారులు, పోలీసు మరియు రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి బుధవారం అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండామారిపల్లి హెలిప్యాడ్ నుంచి బీకే పల్లి సభా వేదిక వరకు ముఖ్యమంత్రి పర్యటించే మార్గాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. రూట్ మ్యాప్, సభా ప్రాంగణం, వీఐపీల రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
సీఎం, కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, సభా ప్రాంగణంలో ప్రజల రాకపోకలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పర్యటనను విజయవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్, ఎస్పీ అధికారులను ఆదేశించారు.