BREAKING
వైసిపి కౌన్సిలర్ల పై అధికారులు పక్షపాతం వెంకన్న నిత్య అన్నదాన పథకానికి విరాళాలు విలువ కార్తీక పౌర్ణమి వేళ నృసింహ క్షేత్రానికి భక్తజనసంద్రం - 9వ గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు పకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన యువత క్రీడాల్లో రాణించాలి చిట్టమూరు సర్పంచ్‌గా గణపర్తి సుశీలమ్మ ఏకగ్రీవం గ్రామ ప్రజల ఏకాభిప్రాయం.. 10 వార్డులూ ఏకగ్రీవం ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ గ్రామాభివృద్ధే లక్ష్యం: గణపర్తి కిషోర్ నాయుడు 10 గ్రామపంచాయతీలలో ఎన్నికలు షురూ..! కుటుంబ బాధ్యతలను ఆవిష్కరించిన మరాఠీ చిత్రం ఆది అనంత్ జంగంపల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభం బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, శిరోమణి అకాలీదళ్ పునరేకీకరణ కన్నుల పండవగా శ్రీ గండి వెంకటేశ్వర స్వామి  కల్యాణోత్సవం ఇఫీ 2026 వేదికగా సార్వత్రిక మానవ కోరికలను ఆవిష్కరించిన ఈజిప్టు చిత్రం ది బ్లాక్ సీ ఎదురుగట్లలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు రకాబ్ గంజ్ సాహిబ్ గురుద్వారాలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రత్యేక ప్రార్థనలు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఘన సన్మానం

Select Suryaa Now
లయన్స్ క్లబ్  ఆధ్వర్యంలో  వృద్ధులకు ఘన సన్మానం

ఉండి, మేజర్ న్యూస్: ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు ద్వారంపూడి నారాయణరెడ్డి అధ్యక్షతన క్లబ్ సభ్యులు ఉండి, పెద్ద పుల్లేరు మరియు ఐ భీమవరం గ్రామాలకు చెందిన పలువురు వృద్ధులను వారి నివాసాలలో మర్యాదపూర్వకంగా కలిసి  వారిని ఘనంగా సత్కరించడం జరిగింది.36 సంవత్సరాలు ఏకగ్రీవంగా పెదపుల్లేరు సర్పంచ్ పదవి చేసిన మాజీ సర్పంచ్ కలిదిండి గొల్లరాజు, ఉండి గ్రామానికి చెందిన మాజీ జడ్పిటిసి సభ్యులు మరియు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు కాగిత మహంకాళి, ఉండి గ్రామానికి చెంది ప్రస్తుతం అయిభీమవరం ఉంటున్న కూనపరాజు రామరాజు (దేవుడు రామరాజు) లను క్లబ్ సభ్యులు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ద్వారంపూడి నారాయణరెడ్డి మాట్లాడుతూ సత్కార గ్రహీతలు తమ జీవిత కాలంలో కుటుంబ శ్రేయస్సుతో పాటు సమాజం కొరకు చేసిన సేవలు వెలకట్టలేనివని ఇప్పటికీ లయన్స్ క్లబ్ సభ్యులుగా వారు అందిస్తున్న సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.క్లబ్ కార్యదర్శి రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ వృద్ధుల పట్ల నిరాదరణ తగదని వారిపట్ల ప్రేమ, ఆప్యాయతలు కలిగి ఉంటూ వారి జీవిత అనుభవాల నుండి నేటి తరం యువత స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. వృద్ధాప్యం అనేది జీవితం ముగిసిపోవడం కాదని, అది అనుభవాల నిధి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ సి ఐ ఎఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, క్లబ్ ఉపాధ్యక్షులు ముదునూరి శివరామరాజు, రీజియన్ సెక్రటరీ సత్తి బ్రహ్మారెడ్డి, భూపతిరాజు హరనాధరాజు, గొట్టుముక్కల రాము, కలిదిండి సీతారామరాజు, వేగేశ్న అనంతలక్ష్మి తదితరులు పాల్గొని సత్కార గ్రహీతలకు అభినందనలు తెలిపారు.

పసుమర్త రామ  జిల్లా ఇంచార్జ్