లక్ష్మీదేవి, సాయి ఉపేక్షలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనోహర్ నాయుడు ప్రచారం..
శ్రీకాకుళం, నవంబర్ 17 మేజర్ న్యూస్: శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 37వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి డాక్టర్ జలగడుగుల సాయి ఉపేక్షకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన డివిజన్ పరిధిలో ప్రజలను కలుసుకుంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. శ్రీకాకుళం మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా 37వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి డాక్టర్ జలగడుగుల సాయి ఉపేక్షను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో జలగడుగుల శ్రీను, అర్జి ఈశ్వరరావు, ప్రసాద్, భాస్కరరావు, మదన్ కుమార్, గౌరీశంకర్, అప్పు యాదవ్ తదితరులతో పాటు మహిళలు, యువత, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.