BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

కులాల ప్రాతిపదికన ఓటర్ల సంఖ్య విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ సురేంద్ర

Select Suryaa Now
కులాల ప్రాతిపదికన ఓటర్ల సంఖ్య విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ సురేంద్ర


నర్సీపట్నం అక్టోబర్ 1 మేజర్ న్యూస్ 
ప్రభుత్వ ఉత్తర్వులు జిఓయంయస్ నెంబర్ 1165, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తేదీ 21-09-2026లో వార్డుల రిజర్వేషన్లు ప్రభుత్వం నిర్దేశించిన రూల్స్ ప్రకారం కేటాయించుటకు గాను వార్డు ఓటర్ జాబితాల వారీగా షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఓటర్లు. షెడ్యూల్డ్ కులాలు, మహిళా ఓటర్లను మరియు వెనుకబడిన తరగుతుల ఓటర్లను గుర్తించుటకు గాను ఇంటింటి సర్వే చేపట్టుటకు నిర్ణీత తేదీల షెడ్యూల్ ప్రకటించి యున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఇంటింటి సర్వే చేపట్టుటకు సచివాలయ సిబ్బంది వార్డుల వారీగా తేదీ 23-09-2026 నుండి 25-09-2026 వరకు సర్వే చేపట్టి ఓటర్లను షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ కులాలు, మహిళా ఓటర్లను మరియు వెనుక బడిన తరగతుల ఓటర్లను విడివిడిగా సర్వే చేపట్టి, గుర్తించిన ఓటర్లను ఓటర్ల జాబితాలో ఈ కేటగిరీ వారీగా మార్క్ చేసి ముసాయిదా ఓటర్ల జాబితాలు ఫారం - 1లో తేదీ 26-09-2026న ప్రచురించుట జరిగినది. పై జాబితాలపై అభ్యంతరములు మరియు క్లయిములను తేదీ 28.09.2026 సాయంత్రం 5.00 గంటలు లోగా సమర్పించిన అభ్యంతరములు మరియు క్లైమ్స్ ను పరిశీలన చేసి తుది వార్డు ఓటర్ జాబితాల వారీగా షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ కులాలు, మహిళా ఓటర్లను మరియు వెనుకబడిన తరగుతుల ఓటర్లను ఫారం-6 నందు తేదీ. 01.10.2026 నాడు ప్రచురించుట జరిగినదని కమిషనర్ సురేంద్ర తెలిపారు. షెడ్యూల్ ట్రైబ్స్  
743. షెడ్యూల్ క్యాస్ట్ 4960. ఇతర కులాలు        7070.బీసీ వర్గాలు 36236  మంది ఉన్నారని కమిషనర్ తెలిపారు. పై ఫారం-6 ను ప్రధాన మునిసిపల్ కార్యాలయములోనూ, రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం, తహశీల్దార్ వారి కార్యాలయం మరియు స్వర్ణవార్డు కార్యాలయములలో ప్రచురించబడినవని కమిషనర్ ప్రజలకు తెలిపారు.