కూటమి ప్రభుత్వంలో రహదారులకు మహర్దశ
ఉండి, న్యూస్:కూటమి ప్రభుత్వంలో రహదారులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని ఉండి ఎమ్మెల్యే ,డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘు రామకృష్ణంరాజు అన్నారు. సోమవారం సాయంత్రం ఉండి మండలం చిన్నపుల్లేరులో కోటి 26 లక్షల రూపాయల వ్యయంతో 1.5 కిలోమీటర్ల బిటి రహదారికి, ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఉప్పుగుంట మీదుగా కవిటంపాకల వెళ్లే 2.95 కిలోమీటర్ల బిటి రహదారి కోటి 65 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించేందుకు ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఉండి లోని ప్రభుత్వ కాలనీలో 36 లక్షల రూపాయల వ్యయంతో గ్రావెల్ రహదారులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రహదారులను పట్టించుకోలేదని దానివలన వాహనదారులకు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వాహనాలు ఎప్పటికప్పుడు రిపేరుకి రావడం వల్ల పెట్టుబడి ఎక్కువైపోయేదని కానీ నేటి కూటమి ప్రభుత్వంలో రహదారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా రహదారులు ఉన్నాయని అన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చూస్తుందని ఆయన తెలిపారు. ఆయా కార్యక్రమాలలో చినపుల్లేరు మాజీ ఉప సర్పంచ్ బొర్రా సువర్ణ రాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరాజు, ఇందుకూరి రాంబద్ర రాజు, ఉండి గ్రామ పార్టీ అధ్యక్షులు కాగిత బుజ్జి, డిసి వైస్ చైర్మన్ మంతెన సాయి లచ్చిరాజు, ముదునూరి కృష్ణంరాజు, కర్రి శ్రీనివాస్, గొట్టుముక్కల భాస్కర్ రాజు, ఉండ్రు ఇస్సాకు తదితర కూటమి నాయకులు కార్యకర్తలు వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ :రాజు ఉండి పశ్చిమ గోదావరి