కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమాలకు పెద్దపీట
- శాసనసభ్యులు వనమాడి కొండబాబు
కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమాలకు పెద్దపీట వేయడం జరుగుతుందని, ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జరుగుతుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు.
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు 18, 19, 20 డివిజన్లో ఏటిమోగ ప్రాంతం నందు పర్యటించి ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి ఆకుల భవాని, 18 డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి అంగడి దుర్గారావు, 19 వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి సేరు లక్ష్మి శైలజ శ్రీను, 20 వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి చింతా శ్రీ విమల గంగా పార్వతి లకు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలు అడుగడుగున పూలవర్షంతో శాసనసభ్యులు వనమాడి కొండబాబుకు, NDA కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ పట్టణాల అభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు అందించడంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక స్థానం ఉందని, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా, విజన్ తో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నారని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టణాలు, గ్రామాలు బ్రష్టు పట్టిపోయి, అభివృద్ధి కుంటుపడిందని, సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేశారని, కాకినాడ నగర అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కొండబాబు ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో NDA కూటమి శ్రేణులు, నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.