కూటమి పరిపాలనలో హామీలు నెరవేర్చాము
ముత్తుకూరు, మేజర్ న్యూస్ : కూటమి పరిపాలనలో సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చినామని టిడిపి నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం తాళ్లపూడి గ్రామంలో ఆయన జడ్పిటిసి అభ్యర్థి నీలం ప్రవీణ , మండల పార్టీ అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ తో పాటు పార్టీ కార్యకర్తలతో కలసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జడ్పిటిసి ఎన్నికల్లో నీలం కు భారీ మెజార్టీ వచ్చే విధంగా టిడిపి కార్యకర్తలతో పాటు అనుబంధ సంఘాలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు