BREAKING
అసత్యంపై ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది: ద్వారక దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం! భారత విమానయాన రంగంలో రికార్డుల ప్రస్థానం: 2047 నాటికి 130 కోట్ల ప్రయాణికులే లక్ష్యం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి! సంపద, విజ్ఞానం, శక్తి కలబోసిన భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం: తజికిస్తాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ! కొద్ది వారాల్లోనే భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన! ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు

కూటమి చైర్ పర్సన్ అభ్యర్థిగా ఎడ్యుకేషనిస్ట్ కుర్ర అవర్ణ

Select Suryaa Now
కూటమి చైర్ పర్సన్ అభ్యర్థిగా ఎడ్యుకేషనిస్ట్ కుర్ర అవర్ణ

రేపల్లె మేజర్ న్యూస్;,
త్వరలో జరగనున్న పూలపాలక సంఘ ఎన్నికలలో విద్యావంతురాలు ఎడ్యుకేషనిస్ట్ కుర్ర అవర్ణ కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు జాతీయస్థాయిలో ఐ ఎస్ బి ట్రైనింగ్ ప్రోగ్రాంలో 1000 మందిలో రెండుసార్లు ఎంపికైన  ఘనత కూడా దక్కింది బి ఏ ఎల్ ఎల్ బి (హెచ్ ఓ ఎంన్ ఎస్) చదివి సమాజ సేవలో ముందుండేవారు ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టు కుటుంబం ఈడుపుగంటి భాను ప్రసాద్ భారతి ల ముద్దుల బిడ్డ అవర్ణ పట్టణంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ చలపతిరావు కోడలిగా పట్టణంలో అడుగుపెట్టారు ఈమె భర్త ప్రముఖ వైద్యులు డాక్టర్ మహేష్, కుమారుడు వెంకట శైలేష్ ప్రస్తుతం ఎంబిబిఎస్ చేస్తున్నారు గతంలో డాక్టర్ చలపతిరావు వైద్యశాల పేద రోగులకు ఉచితంగా వైద్యం అందించిన ఘనత కూడా ఉంది. వీరి కుటుంబం రేపల్లె వేమూరు బాపట్ల అవనిగడ్డ నియోజకవర్గ ప్రజానీకానికి సుపరిచితులు వైద్యరంగపరంగా అనేక సేవా కార్యక్రమాలు అందించిన ఘనత కూడా వీరి కుటుంబానికి దక్కింది వైద్యరంగం తో పాటు సమాజంలో విద్య ద్వారా అస్మానతలను తొలగించవచ్చనే దృఢ సంకల్పంతో 2003 వ సంవత్సరంలో రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ను 250 మంది విద్యార్థులతో స్థాపించి నేడు 1200 మంది విద్యార్థులు విద్యాభ్యాసాన్ని అభ్యసిస్తున్నారు తల్లిదండ్రులు లేని పిల్లలను ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా విద్యను అందించడంతోపాటు యూనిఫాం దుస్తులు పుస్తకాలు కూడా ఉచితంగా అందించి ఎందరో పేద విద్యార్థులకు విద్యను అందించిన ఘనత కూడా అవర్ణ కుటుంబానికి ఉంది పదవ తరగతి పూర్తయి కాలేజీ చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వందలాది మది విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ వారు ఉన్నత విద్య చదువుకోవడానికి వీరి కుటుంబం ఎంతగానో దోహదపడుతుంది. వీరి ద్వారా విద్యను అభ్యసించిన విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత విద్యారంగంలోనూ మంచి ఉద్యోగాలు పొందిన వారు అనేక మంది ఉన్నారు అంతేకాకుండా ప్రభుత్వం జీవో ఇచ్చిన ఇవ్వకపోయినా జర్నలిస్టు కుటుంబాల పిల్లలకు 50 శాతం రాయితీతో విద్యాభ్యాసం అందించిన ఘనత కూడా వీరికే దక్కింది కరోనా సమయంలో తమ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థి కుటుంబాలకు పనిచేస్తున్న సిబ్బందికి నిత్యవసర వస్తువులు దుప్పట్లు వారికి కావలసిన సామాగ్రిని కూడా అందించారు. విద్యారంగం పట్ల మక్కువ కలిగి ప్రతి ఒక్కరూ చదువుకోవాలని దృఢ సంకల్పంతో వెనుకబడిన సామాజిక వర్గాల పిల్లలను పాఠశాలలు చేర్పించి వారిక కావలసిన పుస్తకాలు యూనిఫాం  కూడా అందించారు. అటు విద్యా రంగంతో పాటు అవర్ణ మామ డాక్టర్ చలపతిరావు ఆయన సతీమణి నిర్మల దేవి వారి వద్దకు సహాయం కోసం వెళ్లిన ఏ ఒక్కరిని కూడా వట్టి చేతులతో తిప్పి పంపించేవారు కాదని పట్టణంలో చర్చించుకుంటున్నారు వీరి కుమారులు రఘు కాకినాడలో ఆక్వా రంగం ద్వారా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు చైర్పర్సన్ అవర్ణ భర్త డాక్టర్ మహేష్ వైద్య పరంగా పేద బడుగు బలహీన వర్గాలకు అవసరమైన ఉచిత వైద్యానికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యాన్ని అందించి ప్రాణాలను నిలబెడుతున్న సంఘటన కూడా ఎన్నో ఉన్నాయి ఇంకో కుమారులు రాజేష్ విజయవాడలో బిజినెస్ చేస్తూ ఎందరికో నిరుద్యోగులకు ఉపాధి చూపిస్తున్నారు. ఇలాంటి ఉన్నతమైన కుటుంబంలో విద్యావంతురాలు అయిన కుర్ర అవర్ణకు చైర్పర్సన్ సీటు కేటాయించడం అభినందనీయమని ఇంతటి కృషి చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు పట్టణ ప్రజానీకం కృతజ్ఞతలు తెలుపుతున్నారు.