కూనల కొండమ్మమృతికి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్
వింజమూరు మేజర్ న్యూస్ : వింజమూరు మండలం చాకలికొండ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వ్యాపారవేత్త కూనల వెంకటేశ్వర్లు తల్లి కూనల కొండమ్మ మంగళవారం పరమపదించారు. ఈ విషయం తెలుసుకున్న ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ బుధవారం చాకలికొండలోని వారి స్వగృహానికి చేరుకుని, కొండమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆప్తులను కోల్పోవడం ఎంతో బాధాకరమని, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు. కూనల కొండమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో వింజమూరు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గూడా నర్సారెడ్డి సొసైటీ డైరెక్టర్ కోడూరు నాగిరెడ్డి చాక లకొండ మాజీ సర్పంచ్ గడ్డం రమణారెడ్డి పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.