BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

కొనసాగుతున్న బ్రహ్మాకుమారిస్ సంస్థ అవగాహన కార్యక్రమాలు

Select Suryaa Now
కొనసాగుతున్న బ్రహ్మాకుమారిస్ సంస్థ అవగాహన కార్యక్రమాలు

అరకులోయ, సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్: 
రాజయోగ టీచర్ సిస్టర్ బి. కె.లీలాకుమారి తలపెట్టిన
నషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అరకులోయ మండలంలోని అన్ని యాజమాన్యపు పాఠశాలలు,కళాశాలల్లో నషా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారు. మండలంలోని పద్మాపురం జంక్షన్ వద్ద గల రాజయో మెడిటేషన్ సేవా కేంద్రం నిర్వాహకురాలు రాజయోగ టీచర్ సిస్టర్ బి.కె.లీలా కుమారి ఆధ్వర్యంలో యువతీ,యువకులను
మాదకద్రవ్యాలు,చెడు అలవాట్లు,ఆధునిక డిజిటల్ వ్యసనాల నుంచి కాపాడాలన్న ఉద్దేశంతో విద్యాసంస్థల్లో పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.ప్రభుత్వ విద్యాశాఖ అధికారుల అనుమతితో నషా ముక్త్ భారత్ అభియాన్ పై అవగాహన కార్యక్రమాలు చేపడుతూ కళాశాలల ప్రిన్సిపల్స్,అధ్యాపకులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,విద్యార్థినీ, విద్యార్థులచే ప్రతిజ్ఞలు వంటివి చేస్తున్నారు.
రాజయోగ టీచర్ సిస్టర్ బి.కె.లీలాకుమారి మార్గదర్శకత్వంలో జరుగుతున్న అవగాహన కార్యక్రమాలు మరో రెండు వారాల వరకు కొనసాగుతాయి.వ్యసనాల అన్ని రూపాలకు నో చెప్పండి అనే సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఈ సందర్భంగా రాజయోగ టీచర్ బి.కె.లీలా కుమారి పిలుపునిచ్చారు.
బ్రహ్మాకుమారీస్ సంస్థ 2023 నుంచి భారత ప్రభుత్వ సామాజిక న్యాయం,సాధికారత మంత్రిత్వశాఖతో అవగాహన ఒప్పందం ద్వారా నషా ముక్త్ భారత్ అభియాన్,అదేవిధంగా
2025 నుంచి భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ–నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ద్వారా మిషన్ స్పందన్లో భాగస్వామిగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆమె వివరించారు.