BREAKING
ఒక ఉగ్రవాద దేశం నన్ను ఆ ప్రశ్న అడుగుతోంది.. ఐక్యరాజ్యసమితిలో పాక్ జర్నలిస్ట్‌కు విదేశాంగ మంత్రి జైశంకర్ దిమ్మతిరిగే కౌంటర్ గణనాథుడికి ఘన వీడ్కోలు కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు మృత్యుకుహరాల్లా మారిన పరవాడ – సబ్బవరం రహదారి: ఆకట్టుకుంటున్న ఆర్యన్ గౌర, మోనిషా మోహన్ మేనన్ '#JAAN' ఫస్ట్ లుక్ పోస్టర్.. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్! గణనాథుని కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి అథ్లెటిక్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు.. పతకాలతో అదరగొట్టిన గుల్‌వీర్, మన్‌ప్రీత్, బరణిక! ధారూర్ అభివృద్ధికి రూ.8.40 కోట్ల రోడ్డు నిధులు 12 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత మన్‌ప్రీత్ కౌర్‌కు ఏషియన్ గేమ్స్ పతకం.. ఇక ముందూ పరుగులే లక్ష్యం! తెలంగాణవ్యాప్తంగా ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు.. వేలాది గణనాథుల నిమజ్జనం బోధన్‌లో రూ.5.10 లక్షలకు లడ్డూ వేలం 52 అడుగుల భారీ మహా గణపతి నిమజ్జనం పూర్తి.. నిర్దేశిత ప్రదేశంలో వైభవంగా వీడ్కోలు! ఉప్పాడ దేశంలో సంఘ్ పరివార్‌–గాంధీ పరివార్‌ మధ్య పోరాటం అంతర్జాతీయ సంక్షోభాలు, విభజనల నడుమ గ్లోబల్ సౌత్ గళం మరింత కీలకం.. ఐక్యరాజ్యసమితి వేదికగా విదేశాంగ మంత్రి జైశంకర్ పిలుపు

కోన రవికుమార్

Select Suryaa Now
కోన రవికుమార్

శ్రీకాకుళం వరదల్లో హైటెన్షన్

ప్రవాహంలో కొట్టుకుపోయిన ఎమ్మెల్యే కూన రవికుమార్, కలెక్టర్, ఎస్పీ.. 

తృటిలో తప్పిన పెను ప్రమాదం

 

ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి

జిల్లాలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన అధికార యంత్రాంగానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌తో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు వరద పరిస్థితిని పరిశీలిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ప్రవాహ ఉధృతి పెరిగి నీటిలో కొట్టుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. అందరూ క్షేమంగా ఉండటంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార తదితర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో నదులు, వాగుల్లో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. మడ్డువలస, తోటపల్లి జలాశయాల నుంచి వరద నీరు చేరడంతో నాగావళి నదిలో నీటిమట్టం గణనీయంగా పెరిగింది.వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను, సహాయక చర్యలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే కూన రవికుమార్‌తో పాటు కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు పర్యటించారు. ఈ సమయంలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో అధికారులు ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నారు. నీటి ఉధృతికి కొట్టుకుపోయిన అధికారులను ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సకాలంలో రక్షించారు.నాగావళి నదికి సుమారు 90 వేల నుంచి లక్ష క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.

వరద పరిస్థితిపై మంత్రి అనిత ఆరా

జిల్లాలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వరద ప్రవాహంపై ఒడిశా అధికారులతో జిల్లా యంత్రాంగం నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.ఇదిలా ఉండగా ఇచ్ఛాపురం ప్రాంతంలో బాహుదా నదిలోకి ఒడిశా నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజా పరిణామాలతో శ్రీకాకుళం జిల్లాలో వరద పరిస్థితి తీవ్రత మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది.