BREAKING
మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలపై కాంగ్రెస్ నజర్.. ఇటావా, కన్నౌజ్, మైన్‌పురిలలో త్వరలో పర్యటన: అజయ్ రాయ్

దేశంలో సంఘ్ పరివార్‌–గాంధీ పరివార్‌ మధ్య పోరాటం

Select Suryaa Now
దేశంలో సంఘ్ పరివార్‌–గాంధీ పరివార్‌ మధ్య పోరాటం

కేరళ : దేశంలో ప్రస్తుతం సంఘ్ పరివార్‌, గాంధీ పరివార్‌ మధ్య పోరాటం జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేరళలో జరిగిన ఆర్యదాన్‌ మహమ్మద్‌ 2026 ఉత్తమ ప్రజాసేవక పురస్కార కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

సంఘ్ పరివార్‌ దేశాన్ని మతం, భాష, సంస్కృతి, కులం పేరుతో విభజిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. మరోవైపు గాంధీ పరివార్‌ దేశం కోసం అనేక త్యాగాలు చేసిందని పేర్కొన్నారు.

మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని ఆయన అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి నాయకులు కూడా దేశం కోసం కీలక పదవులను త్యాగం చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. 

కేరళలోని నిలంబూరులో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డికి ‘ఆర్యదాన్‌ మహమ్మద్‌ 2026 ఉత్తమ ప్రజాసేవక పురస్కారం’ అందజేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కే.సీ. వేణుగోపాల్‌ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.