BREAKING
మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలపై కాంగ్రెస్ నజర్.. ఇటావా, కన్నౌజ్, మైన్‌పురిలలో త్వరలో పర్యటన: అజయ్ రాయ్

ధారూర్ అభివృద్ధికి రూ.8.40 కోట్ల రోడ్డు నిధులు

Select Suryaa Now
ధారూర్ అభివృద్ధికి రూ.8.40 కోట్ల రోడ్డు నిధులు

 

17.10 కి.మీ. మేర రహదారుల అభివృద్ధి
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాన్‌సింగ్

ధారూర్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 24):
ధారూర్ మండలంలోని గ్రామాలు, తండాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.8.40 కోట్ల రోడ్డు నిధులు మంజూరు చేయడం సంతోషకరమైన విషయమని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాన్‌సింగ్ అన్నారు. ఈ నిధులతో మండల పరిధిలో మొత్తం 17.10 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.ముఖ్యంగా పీడబ్ల్యూడీ–జీడిగడ్డ తండా, ధారూర్–కొండాపూర్, నాగసముందర్–అల్లాపూర్ తదితర ప్రధాన రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. రహదారుల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రజల ప్రయాణ ఇబ్బందులు తొలగనున్నాయని అన్నారు. రోడ్ల అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల ఆర్థిక, సామాజిక ప్రగతికి దోహదపడుతుందని మాన్‌సింగ్ పేర్కొన్నారు.ధారూర్ మండల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, శాసనసభ స్పీకర్‌, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.రిపోర్టర్ సుధాకర్