BREAKING
మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలపై కాంగ్రెస్ నజర్.. ఇటావా, కన్నౌజ్, మైన్‌పురిలలో త్వరలో పర్యటన: అజయ్ రాయ్

కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

Select Suryaa Now
కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

చిన్నపాటి లోపానికీ తావులేకుండా ఏర్పాట్లు.. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి

ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి.. కార్యక్రమం ఆదర్శంగా నిలవాలి

జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

 సూర్య కరీంనగర్ ప్రతినిధి ::

 ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల జరగనున్న కరీంనగర్ జిల్లా నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా చిన్నపాటి లోపానికీ తావులేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పష్టం చేశారు.

భవనాన్ని పరిశీలించిన కలెక్టర్

శుక్రవారం రాత్రి నూతన కలెక్టరేట్ భవనాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ రెవెన్యూ డి. శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు అధికారులతో
కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్ చాంబర్, సమావేశ మందిరం, అదనపు కలెక్టర్ల చాంబర్లు, మంత్రుల సమీక్ష సమావేశాల కోసం ఏర్పాటు చేసిన హాళ్లు, ఇతర గదులను పరిశీలించి అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.

పండుగ వాతావరణంలో ప్రారంభోత్సవం

నూతన కలెక్టరేట్ భవనాన్ని అత్యంత సుందరంగా అలంకరించాలని, ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచేలా ప్రతి అంశాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని పేర్కొన్నారు.

ప్రోటోకాల్‌కు ప్రాధాన్యం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు అధికారులు, ఇతర ఉన్నతాధికారుల పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. వారికి స్వాగతం పలకడంతో పాటు కార్యక్రమం పూర్తయ్యే వరకు సమన్వయం చేసేందుకు లైజనింగ్ అధికారులను ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని తెలిపారు.

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు

కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి కూడా పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. వేదిక, ప్రెస్ గ్యాలరీ, అతిథులు, ప్రజలు, మీడియాకు అవసరమైన ఇతర సదుపాయాల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశ మందిరంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు. కార్యక్రమం నిర్వహణలో చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం ఘనంగా, సమర్థవంతంగా జరిగేలా అధికారులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రెవెన్యూ డి. శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో స్వామి, ఆర్డీవో షర్మిల, ఏవో సుధాకర్, ఆర్‌అండ్‌బీ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.