ఖంభంపాడులో జనసేన అభ్యర్థి ఎన్నికల ప్రచారం
ఖంభంపాడు: వత్సవాయి మండలం ఖంభంపాడు గ్రామంలో జనసేన పార్టీ అభ్యర్థి జక్కుల నాగరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బడిశా మురళీకృష్ణ, ఖంభంపాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అప్పారావు, చావా అనసూర్య తదితరులు పాల్గొన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.