BREAKING
రాజాం ప్రగతికి ప్రజా మద్దతు కోరిన రాజ్యసభ సభ్యులు " చింతకాయల ",ఎమ్మెల్యే " కోండ్రు " బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా, శర్వరి జోడీ మ్యాజిక్.. యే ప్రేమ్ మోల్ లియా తొలిరోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే రాజకీయాలంటే పదవులే ప్రామాణికం కాదు:కిమిడి వంగర మండలంలో వేడెక్కిన పంచాయతీ పోరు ఏడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం 22 సస్థానాల్లో హోరాహోరి మరమ్మతులకు గురైన త్రాగు నీటి పైపులైన్లు కు మరమ్మతులు చేపట్టాలి అర్జున్ కపూర్‌తో సాహిబా బాలి గుర్‌పురబ్ పోస్ట్.. డేటింగ్ రూమర్లపై మరోసారి మంటలు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఎన్నికల అధికారి ఎం రత్నం రెండో విడత ఎన్నికల్లో 61 పంచాయతీలు ఏకగ్రీవం... మై ప్రేమ్ కీ దివానీ హూన్ విషయంలో ఆ ముగ్గురికి అన్యాయం చేశా.. సూరజ్ బర్జాత్యా ఆసక్తికర వ్యాఖ్యలు పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలే ప్రధానం.. సొంట్యాంలో "ప్రజలతో ముఖాముఖి" జీతం ఫుల్.. డ్యూటీ డల్! కిమిడి నాగార్జున ను కలిసిన డిప్యూటీ మేయర్.. నీటి సరఫరా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..... ముక్కా శ్రావణి నీ పరామర్శించిన మేయర్ భార్గవి..* ఫోన్ లో ఎమ్మెల్యే అదితి పరామర్శ.... దివ్యాంగ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు పారాస్పోర్ట్స్ రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్ పోటీలు..

ఖాకీ దుస్తుల్లోనూ ఆత్మీయత..

Select Suryaa Now
ఖాకీ దుస్తుల్లోనూ ఆత్మీయత..

గరుగుబిల్లి, నవంబర్ 25, మేజర్ న్యూస్:పంచాయతీ ఎన్నికల బందో బస్తు విధుల్లో భాగంగా మరుపెంట గ్రామ పరిశీలనకు వెళ్లిన ఎస్ఐ షేక్ ఫక్రుద్దీన్ తన మానవీయ కోణాన్ని చాటుకున్నారు. పంచాయతీ ఎన్నికల బందోబస్తు విధుల్లో భాగంగా మండల పరిధిలోని మరుపెంట గ్రామ పంచాయ తీ పరిశీలనకు వెళ్లిన ఎస్‌ఐ షేక్ ఫక్రుద్దీన్ బుధవారం తన స్నేహపూర్వక వైఖరితో స్థానికుల మనసు గెలుచుకు న్నారు.ఎన్నికల భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎస్ ఐ షేక్ ఫక్రుద్దీన్ మరుపెంట మీదుగా వెళ్తున్న సమ యంలో సంప్రదాయ పద్ధతిలో పల్లకిపై వస్తున్న నూతన వధూవరులు ఎదురు పడ్డారు.వారిని గమనించిన ఎస్‌ఐ ఫక్రుద్దీన్ వెంటనే ఆగి నూతన జంటను ఆప్యాయంగా పలకరించి శుభాకాం క్షలు తెలిపారు.నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని వారిని ఆశీర్వదించారు. అనంతరం వధూవరులు మరియు వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు పల్లకి వద్దే వారితో కలిసి సంతోషంగా ఫోటోకు దిగారు.విధి నిర్వహణలో ఎంతో బిజీగా ఉంటూనే, సామాన్యుల వేడుకలో భాగస్వాములై వారిని ఆశీర్వదించిన ఎస్‌ఐ షేక్ ఫక్రుద్దీన్ తీరును స్థానికులు అభినందిస్తున్నారు.విధి నిర్వహణలో కఠినంగా కనిపించే పోలీస్ అధికారి, ఇలా సామాన్యుల  ఆనందంలో భాగస్వామ్యం కావడం పట్ల వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.