కరెంట్ షాక్ బాధితుడికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆర్థిక సాయం
రూ.10 వేలు సాయం - కాకర్ల ట్రస్ట్ ద్వారా అందజేత
వింజమూరు మేజర్ న్యూస్ : చాకలికొండ గ్రామానికి చెందిన లోకసాని వెంకటకృష్ణ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురై తీవ్రంగా గాయపడిన విషయాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ద్వారా తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెంటనే స్పందించారు. క్షతగాత్రుడికి అవసరమైన వైద్యచికిత్సఅందించేందుకు కాకర్ల చారిటబుల్ ట్రస్టద్వారా తక్షణ సహాయంగా రూ.10,000 ఆర్థికసహాయాన్నిఅందజేశారు.బాధిత కుటుంబానికి అండగా నిలిచి అత్యవసర సమయంలో ఆదుకోవడం పట్ల గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా తన వంతు సహాయం అందించడమే లక్ష్యంగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూనలవెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి సొసైటీ డైరెక్టర్ కోడూరు నాగిరెడ్డి ఇతర నాయకులు కార్యకర్త తదితరులు పాల్గొన్నారు