కప్పు సాసర్ గుర్తుపై ఓటేసి గెలిపించండి సుదేపల్లి సర్పంచ్ అభ్యర్థి మర్రెడ్డి పద్మావతమ్మ ముమ్మర ప్రచారం
వెల్దుర్తి మేజర్ న్యూస్:సుదేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన మర్రెడ్డి పద్మావతమ్మ గెలుపే లక్ష్యంగా గ్రామంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆదివారం గ్రామంలోని బీసీ కాలనీలో నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి ఆమె ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా బ్యాలెట్ నమూనా పత్రాలను ఓటర్లకు చూపిస్తూ, డిసెంబరు 2న జరగనున్న పోలింగ్‌లో బ్యాలెట్ పత్రంపై 6వ నంబరులో ఉన్న తమ "కప్పు సాసర్" గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మర్రెడ్డి ప్రతాప్ రెడ్డి సతీమణి పద్మావతమ్మతో పాటు నాయకులు శరభారెడ్డి, శారదమ్మ, శ్రీనివాసరెడ్డి, శిల్పారాణి, రమణారెడ్డి, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.