*కన్యకా పరమేశ్వరాలయంలో ప్రత్యేకపూజలు.*
కుందుర్పి సూర్య ప్రతినిధి మండలకేంద్రమైన కుందుర్పిలో శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా రెండవ రోజు నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్య వాసవి సేవదల్ రాష్ట్ర డైరెక్టర్ గూనిపుటి గోవిందరాజులు,గునుపూటి వసంతకుమారి దంపతుల ఆధ్వర్యంలో వారికుటుంబ సభ్యులచే ప్రత్యేకపూజ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఈశ్వరునికి అభిషేకం,వాసవి మాతకు పంచామృతాభిషేకం, మహా మంగళహారతి లాంటి ప్రత్యేకపూజలు నిర్వహించారు.అనంతరం కుంకుమార్చన, పల్లకిసేవా కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా రంగురంగుల పూలతో ఉత్సవవిగ్రహాలను అందంగా అలంకరించారు.మిరమిట్లు గొలుపే విద్యుత్ కాంతులతో దేవాలయాన్ని అలంకరించారు.ఈసందర్భంగా అనేక మంది ఆర్యవైశ్యులు ప్రత్యేకపూజా కార్యక్రమంలో పాల్గొని దేవిఆశీస్సులు తీసుకున్నారు. టి.రాజురిపోర్టర్