BREAKING
మద్యం సీసాల రవాణా కేసులో సీప్లేన్ జప్తు పెరూ కలావోలో నేరాలపై యుద్ధం: కీకో ఫుజిమోరి ప్రభుత్వానికి క్షేత్రస్థాయి సవాళ్లు ‘యే ప్రేమ్ మోల్ లియా’ మూవీ రివ్యూ: ఆయుష్మాన్ ఖురానా, శర్వరీల ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే? చీపురుపల్లి మండలంలో ఐదు పంచాయతీల్లో 12 వార్డులు ఏకగ్రీవం నిరుద్యోగులపై బీఆర్ఎస్‌కు మొసలి కన్నీరుః టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని ఎలిజబెత్ హోమ్స్ నిజస్వరూపంపై ‘యు క్యాన్ సీ ఎవ్రీథింగ్’ డాక్యుమెంటరీ ఎలా ఉందంటే? క్యూబెక్ మత చిహ్నాల నిషేధ చట్టంపై కెనడా సుప్రీంకోర్టు తీర్పు ముంబై, పుణెలో సంగీత, ఆహార వేడుకల సందడి.. దిల్‌జిత్ దొసాంఝ్, రోలింగ్ లౌడ్ కచేరీలు అమెరికా వైమానిక దళ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌పై హ్యాకర్ల దాడి: కీలక డేటాకు ముప్పు! తెలంగాణను దేశంలోనే ప్రముఖ క్రీడా రాష్ట్రంగా తీర్చిదిద్దుతాంః మంత్రి పొన్నం నా సినిమాల్లో షాక్ వ్యాల్యూ ఉండాల్సిందే.. ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలనేదే నా లక్ష్యం: సందీప్ రెడ్డి వంగా వయోవృద్దుల సమైక్య ఆధ్వర్యంలో నషా ముక్తి భారత్ అభియాన్ వారణాసిలో నవంబర్ 28న కాశీ తమిళ సంగమం 5.0 ప్రారంభం రిలయన్స్ పరిహారం ఇచ్చేనా..? బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

కనకదాసు ఆశయాలు, బోధనలు సమాజానికి ఆదర్శం....

Select Suryaa Now
కనకదాసు ఆశయాలు, బోధనలు సమాజానికి ఆదర్శం....

అమలాపురం మేజర్ న్యూస్ 

కనకదాసు ఆశయాలు, బోధనలు సమాజానికి ఆదర్శం..... నివాళులర్పించిన జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి....
 కనకదాసు ఆశయాలు, బోధనలు నేటి సమాజానికి ఆదర్శప్రాయమని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో వివేకానంద సమావేశ మందిరంలో కనకదాసు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కనకదాసు జీవిత విశేషాలను స్మరించుకుంటూ, ఆయన భక్తి, సామాజిక చైతన్యం, సమానత్వ భావనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. 
కనకదాసు తన రచనలు, బోధనల ద్వారా సమాజంలో మానవతా విలువలను పెంపొందించేందుకు కృషి చేశారని తెలిపారు.
కనకదాసు జీవితం, ఆయన బోధనలు ప్రజలకు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని జాయింట్ కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వీ సుబ్బారావు, బీసీ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు                               

రంబాల నాగసత్య నారాయణ        అమలాపురం