కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సమీక్షను నిర్వహించారు
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ వారాంతపు సమీక్షలో భాగంగా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులతో శుక్రవారం కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సమీక్షను నిర్వహించారు.
నగర పాలక సంస్థ పరిధిలోని కార్పొరేషన్ స్థలాలు, ఆర్ & బి, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా పటిష్టమైన చర్యలను తీసుకుని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ఎల్.ఆర్.ఎస్ కు సంబంధించిన ఫంక్షనల్ పాటర్న్స్, ఐ.పి.ఎల్.పి పాటర్న్స్ పెండింగులో లేకుండా పూర్తి చేయాలని సూచించారు. డి.పి.ఎమ్.ఎస్ కు సంబంధించిన సవరణలకై సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.
పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సచివాలయాల పరిధిలో రోడ్డు ఆక్రమణలు జరగకుండా, అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.
అసెట్ మేనేజ్మెంట్, నక్ష గ్రౌండ్ ట్రూతింగ్, డిజిటల్ డోర్ నెంబర్స్ అంశాలపై ఎప్పటికప్పుడు తమ లాగిన్లను పరిశీలించుకుని తదుపరి చర్యల కోసం ఫార్వర్డ్ చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో నెల్లూరు నగర పాలక సంస్థ స్వర్ణ వార్డు గ్రామ అదనపు కమిషనర్ హిమబిందు, టి.పి.ఓ సతీష్ వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.