కడుపునొప్పి తాళలేక యువతి ఆత్మహత్య..
గజపతినగరం,సెప్టెంబర్ 27, మేజర్ న్యూస్ :
మండలంలోని డోలపాలెం గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి వాసదేవి కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం, వాసా చిలకమ్మకు వాస దేవి చిన్న కుమార్తె.
గత కొన్ని నెలలుగా వాసదేవి కడుపునొప్పితో బాధపడుతుంది. ఈ నేపథ్యంలో కడుపునొప్పి తట్టుకోలేక ఈ నెల 25న మోతాదుకు మించి ఐరన్ మాత్రలు మింగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వాస దేవి పరిస్థితి విషమించడంతో ఈ నెల 26న సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో మృతి చెందింది.ఈ ఘటనపై ఆదివారం ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు.