కావలిలో వలల షాపులో అగ్నిప్రమాదం: రూ. 5 నుంచి 8 లక్షల ఆస్తి నష్టం
కావలి (మేజర్ న్యూస్):
కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్డు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మత్స్యకారులకు అవసరమైన వలలు, ఇతర సామాగ్రి విక్రయించే షాపు యజమాని తేజ మాట్లాడుతూ, శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 5 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
స్థానికులు, సిబ్బంది చరవాణి (ఫోన్) ద్వారా సమాచారం ఇవ్వడంతో అగ్నిప్రమాద విషయం వెలుగులోకి వచ్చింది. రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్లిన తర్వాత తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించి ఉండవచ్చని బాధితుడు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల నుండి రూ. 8 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
కాగా, కుటుంబ ఆస్తుల వివాదాలే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.