కావలి మున్సిపల్ చైర్పర్సన్గా ఎస్సీ అభ్యర్థికి అవకాశం కల్పించాలి: బీసీ ఐక్య వేదిక డిమాండ్.
కావలి మేజర్ న్యూస్:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు మెజారిటీ స్థానాలు కేటాయించాలని బీసీ ఐక్య వేదిక కావలి నియోజకవర్గ కన్వీనర్, న్యాయవాది బెజవాడ అభిసాగర్ ప్రజాపతి, బీసీ ఐక్యత భవన్ అధ్యక్షుడు అద్దంకి ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం కావలి జర్నలిస్ట్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
రాబోయే కావలి మున్సిపల్ ఎన్నికల్లో చైర్పర్సన్ పదవిని ఎస్సీ అభ్యర్థికి కేటాయించి సామాజిక న్యాయం పాటించాలని కోరారు. ఓపెన్ కేటగిరీలోనూ బడుగు, బలహీన వర్గాలకు తగిన అవకాశాలు కల్పించాలని, అలా కాకుండా బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తే రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని హెచ్చరించారు. అంతేకాకుండా, నెల్లూరు జిల్లాలో రాజకీయ పార్టీలు బీసీలకు ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్లపై రాజకీయ పార్టీలు స్పందించకపోతే బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు గుంజి నరేష్ వడియరాజ్, న్యాయవాది వట్టికాల రామ్ వినోద్ తదితరులు పా