కాశీనాయన ఆశ్రమంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణ శివార్లలోని తిరునాళ్ళతిప్ప వద్ద వెలసియున్న శ్రీ కాశీనాయన ఆశ్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండవ రోజు సోమవారం గాయత్రీదేవి అమ్మవారిని శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధికంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్తప్రసాదాలు స్వీకరించారు. యదావిధిగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కొనసాగించారు.