BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

కార్పొరేషన్ లో ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం

Select Suryaa Now
కార్పొరేషన్ లో ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్  :  కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ నిర్దేశాల మేరకు నెల్లూరు నగర పాలక సంస్థ అన్ని విభాగాల కార్మికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని నారాయణ మెడికల్ కళాశాల ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని కార్యాలయం ప్రాంగణంలో బుధవారం నిర్వహించారు.  నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దినేష్ మాట్లాడుతూ కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రత్యేకంగా నెల్లూరు నగరపాలక సంస్థ లో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ విభాగం సిబ్బంది ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన " సఫాయీ అప్నావో - బీమారీ భగావో" నినాదంతో పారిశుధ్య కార్మికులంతా ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కొనసాగించేందుకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని తెలియజేశారు.  ఉచిత వైద్య శిబిరం ద్వారా అందిస్తున్న నాణ్యమైన వైద్య పరీక్షలు, ఉచితంగా అందిస్తున్న మందుల సహకారంతో సిబ్బంది అందరూ తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని విధుల నిర్వహణలో పాల్గొనాలని డాక్టర్ సూచించారు.