BREAKING
సూళ్లూరుపేట, వెంకటగిరి, గుత్తి, పెనుకొండ కూటమి కైవసం.. పుంగనూరులో టీడీపీ ఘనవిజయం కౌంటింగ్ కేంద్రంలో వివాదం -బీజేపీ నేతను తోసేసిన పోలీసులు -జనరల్ ఏజెంటైన తనను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని బీజేపీ పొనగంటి భాస్కర్‌ ఆగ్రహం మదనపల్లె మున్సిపల్ ఎన్నికల లెక్కింపు: తొలి రౌండ్‌లో టీడీపీ, బీజేపీ కూటమి ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం బ్యాంక్ మేనేజర్ కు రైతుల వినతిపత్రం కళ్యాణదుర్గం కూటమి హవా.. 16 వార్డుల్లో 13 చోట్ల విజయం. ఏపీ మున్సిపల్ కౌంటింగ్ ట్రెండ్స్: కూటమి అభ్యర్థుల హవా ఎల్‌నినో ముప్పు.. నీటి భరోసాకు ముందస్తు చర్యలు! తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి మదనపల్లి మున్సిపాలిటీలో 1, 11, 15 వార్డుల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం 72 టేబుళ్లపై కొనసాగుతున్న కౌంటింగ్.. తొలి రౌండ్ ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ ప్రతి నీటి బొట్టూ అమృతమే! రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎల్లేని సుధాకర్ రావు ఏపీ కార్పొరేషన్ల ఎన్నికల కౌంటింగ్: 8 చోట్ల కూటమి అభ్యర్థుల ఆధిక్యం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో వై కా పా పాగా.. 3,4,14వార్డుల్లో విజయం. కార్పొరేషన్ కౌంటింగ్ ప్రారంభం -మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు

కార్పొరేషన్ కౌంటింగ్ ప్రారంభం -మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు

Select Suryaa Now
కార్పొరేషన్ కౌంటింగ్ ప్రారంభం  -మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఎస్ వి ఆర్ట్స్ కళాశాలలో  కౌంటింగ్ కు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మంగళవారం కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకుని కౌంటింగ్ ను ప్రారంభించినట్లు ఆర్వో జయకృష్ణ తెలిపారు. 

పోస్టల్ బ్యాలెట్ వివరాలు…

ఈ సందర్భంగా వీడియో సెంటర్లో ఆయన మాట్లాడుతూ తిరుపతి కార్పొరేషన్ పరిధిలో మొత్తం 444 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఇప్పటికే 25 పోస్టల్ బ్యాలెట్లను ఒక్కొక్క కట్టగా 19 కట్టలగా సిబ్బంది కట్టారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. 

సాధారణ బ్యాలెట్ కౌంటింగ్ మధ్యాహ్నం భోజనం తర్వాత ప్రారంభించనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫలితాలు వెల్లడిస్తామన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం ఓట్లు  2,90,492 అందులో 1,36,031 ఓట్లు  పోలయ్యాయి. 

ఓట్లు లెక్కింపుకు ఏర్పాట్లు

నవంబర్ 1వ తేదీన జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేయర్ అభ్యర్థి ఓట్లు లెక్కింపుకు 35 టేబుల్లను ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపుకు 77 టేబుళ్ళు ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ ఓట్లు లెక్కింపు ఐదు రౌండ్లో కౌంటింగ్ పూర్తిచేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఓట్లు లెక్కింపుకు 600 మంది అధికారులు, 300 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. అందులో కౌంటింగ్ విధులు మొత్తం 59 మంది సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ సూపర్వైజర్ గా 121 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లుగా 363 మంది, మైక్రో అబ్జర్వర్లుగా 25 మందిని ఏర్పాటు చేశారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్