BREAKING
ఫ్రాన్స్ రుణా సంక్షోభం నివాస ప్రాంతంలో 100 కిలోల టపాసుల అక్రమ నిల్వ.. ఇద్దరి అరెస్ట్ గుంతలమయంగా ఘనపూర్ గేటు–చేల్లాపూర్ రోడ్డు.. నూతన రోడ్డు నిర్మించాలి: బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడుసు మహిపాల్ వలేరు రూతమ్మను గెలిపించండి శ్రీ షిరిడి సాయి మందిరంలో సంకష్టహర చతుర్థి వ్రతం.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. వ్రతంలో పాల్గొన్న భక్తులు హెలియన్‌కు భారీ ఎదురుదెబ్బ కిచెన్‌ షెడ్డు లేక చెట్ల కిందే వంటలు.. ఇబ్బందుల్లో వంట కార్మికులు వడ్డీ రేట్ల కంటే ఫ్రాన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం దివ్యాంగ విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు రాజకీయ లబ్ధి కోసమే ఈటల పాదయాత్ర: డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్‌ యాదవ్‌ క్లోరెక్స్ కొత్త సీఈఓగా యూనిలీవర్ మాజీ ఎగ్జిక్యూటివ్ పర్యావరణ పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలి రాష్ట్ర పండుగను తలపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన స్విట్జర్లాండ్ బయోటెక్ దిగ్గజం మాలిక్యులర్ పార్టనర్స్ సంచలన నిర్ణయం

కార్పొరేషన్ ఎన్నికల్లో.. వైసీపీ విజయ బావుటా ఎగరవేయడం ఖాయం - ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

Select Suryaa Now
కార్పొరేషన్ ఎన్నికల్లో.. వైసీపీ విజయ బావుటా ఎగరవేయడం ఖాయం - ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

నెల్లూరు రూరల్,  మేజర్ న్యూస్ :   నెల్లూరు సాలుచింతల గాంధీ గిరిజన కాలనీ ప్రాంతాల్లో.. వైయస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్  ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి . వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు 70వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి భాగి వెంకటరమణ  గార్లతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా డివిజన్ ఇన్ చార్జ్  వెంగళ రెడ్డి  తో కలిసి నిర్వహించిన   రోడ్ షో కార్యక్రమంలో.. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థులు ప్రజలను .. అభ్యర్థిస్తూ.. ముందుకు సాగారు.  కార్పొరేషన్ ఎన్నికల్లో.. వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి  ని అలాగే 70వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి భాగి వెంకటరమణ ని ప్రజలు గెలిపించుకోవాలని.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి . ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  ఈరోజు నగర కార్పొరేషన్.. లో అవినీతిమయం అయ్యిందని .. కార్పొరేషన్ లో ప్రజాసొమ్మును దుర్వినియోగం చేస్తూ అడ్డగోలుగా పనులు చేస్తున్నారని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి   అన్నారు.   నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. కైవసం అయితేనే.. కార్పొరేషన్ లో జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేసి.. ప్రజా పాలనకు శ్రీకారం చుట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు.   కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి.. కార్పొరేషన్ను దోపిడీదారుల నుంచి  కాపాడాలని కోరారు.