జిల్లాలో స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికలకు షెడ్యూల్...
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. నవంబర్ 3న గ్రామ పంచాయతీ ఎన్నికలు....
అమలాపురం,మేజర్ న్యూస్ :జిల్లాలో స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 19న ఎన్నికల సంఘం నోటిఫికేషన్తో ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ గురువారం తెలిపారు. అక్టోబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ప్రకటన జారీ చేస్తారని, అక్టోబర్ 23 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీగా, అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 25న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్, అక్టోబర్ 26న అప్పీళ్ల పరిష్కారం, అక్టోబర్ 27న అభ్యర్థిత్వాల ఉపసంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన ఉంటాయని పేర్కొన్నారు. నవంబర్ 3న పోలింగ్, అవసరమైతే నవంబర్ 4న తిరిగి పోలింగ్, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరుగుతాయని తెలిపారు. పరోక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేసి, నవంబర్ 7వ తేదీలోగా సభ్యులకు నోటీసులు అందించి, నవంబర్ 11 లేదా 12న ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికలు చేపడతారని వివరించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి దశ నవంబర్ 26న పోలింగ్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి మొదటి దశ నోటిఫికేషన్ నవంబర్ 13న విడుదల కానుందని కలెక్టర్ తెలిపారు. నవంబర్ 15న ఎన్నికల ప్రకటన జారీ చేస్తారని, నవంబర్ 17 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీగా, నవంబర్ 18న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 19న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్లు, నవంబర్ 20న అప్పీళ్ల పరిష్కారం, నవంబర్ 21న అభ్యర్థిత్వాల ఉపసంహరణతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారని పేర్కొన్నారు. నవంబర్ 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన చేపడతారని తెలిపారు. అవసరమైతే నవంబర్ 27న తిరిగి పోలింగ్ నిర్వహిస్తారని, పరోక్ష ఎన్నికలకు నవంబర్ 13న నోటిఫికేషన్ విడుదల చేసి, నవంబర్ 26వ తేదీలోగా సభ్యులకు నోటీసులు అందించి, నవంబర్ 26 లేదా 27న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని వివరించారు.గ్రామ పంచాయతీ ఎన్నికలు – రెండో దశ నవంబర్ 29న పోలింగ్
రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 16న విడుదలవుతుందని, నవంబర్ 18న ఎన్నికల ప్రకటన జారీ చేస్తారని కలెక్టర్ డా.ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. నవంబర్ 20 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీగా, నవంబర్ 21న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 22న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్లు, నవంబర్ 23న అప్పీళ్ల పరిష్కారం, నవంబర్ 24న అభ్యర్థిత్వాల ఉపసంహరణతో పాటు తుది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని పేర్కొన్నారు. నవంబర్ 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన చేపడతారని తెలిపారు. అవసరమైతే నవంబర్ 30న తిరిగి పోలింగ్ నిర్వహిస్తారని, పరోక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదల చేసి, నవంబర్ 29వ తేదీలోగా సభ్యులకు నోటీసులు అందించి, నవంబర్ 29 లేదా 30న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని వివరించారు.