జీవో నెంబర్ 158 అమలుకు సత్వర చర్యలు చేపట్టండి
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. జీవో నెంబర్ 158 అమలకు సత్వరమే చర్యలు చేపట్టాలని ఎస్ టి యు జిల్లా అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో డి ఈ ఓ కార్యాలయంలో బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ కు ఎస్ టి యు ,టి ఎన్ యు ఎస్ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన జి ఓ .నెం 158 ప్రకారం 2003 డీఎస్సీ ద్వారా ఎంపిక కాబడి,వివిధ కారణాల రీత్యా 2004 సెప్టెంబర్ 1 న తేదీ తర్వాత ఉపాధ్యాయులుగా నియామకం అయినవారు సి పి ఎస్ నుండి పాత పెన్షన్ విధానం ఓ పి ఎస్ నకు మారడానికి అవకాశం కలిగినదని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ ఉత్తర్వులు అమలు కావాలంటే ఇన్షియల్ అపాయింటింగ్ అథారిటీగా చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయుల వివరాలు పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని తెలిపారు.2003 డీఎస్సీ సెలక్షన్ లిస్ట్, ఉపాధ్యాయుల అపాయింట్మెంట్ ఆర్డర్, వారు సర్వీస్ లో జాయిన్ అయినప్పటి జాయినింగ్ రిపోర్ట్, వారి సర్వీస్ రిజిస్టర్ లను పరిశీలించి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధి లోని ఉపాధ్యాయులకు తగిన ఉత్తర్వులు ఇచ్చిన వారు 15 రోజుల లోపు నీది యాప్ లో వివరాలు అప్లోడ్ చేయవలసి ఉన్నందున, చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయం నందు ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు రాష్ట్ర నాయకులు గంటా మోహన్, చంద్రన్, టి ఎన్ యు ఎస్ అధ్యక్షులు మధుసూదన్ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు ఢిల్లీ ప్రకాష్, పురుషోత్తం, నరేంద్ర, వాసు, బాబు, లోకనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉమా శంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.